ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్‌కు కెరీర్లో ఉన్నత దశ నడుస్తోంది. ఇటీవల ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇతడిని రూ15.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా ఉన్న ఈ ఆటగాడు న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో విజృంభిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 28 పరుగులిచ్చి ఐదు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా కివీస్ జట్టు 148 పరుగులకే ఆలౌటైంది. ఈ విషయంపై ఆసీస్ అభిమానులు స్పందిస్తూ కమిన్స్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడిని దేశానికి ప్రధానమంత్రి చేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
'కమిన్స్‌ను దేశానికి ప్రధాని చేయండి' - 'కమిన్స్‌ను దేశానికి ప్రధాని చేయండి'
న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ అతడిని దేశానికి ప్రధాని చేయాలని ట్వీట్లు చేస్తున్నారు.
కమిన్స్
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కివీస్‌పై ప్రస్తుతానికి 456 పరుగుల ఆధిక్యంలో ఉంది కంగారూ జట్టు. మాథ్యూ వేడ్ (15), ట్రవిస్ హెడ్ (11) క్రీజులో ఉన్నారు.
ఇవీ చూడండి.. బిగ్‌బాష్ లీగ్‌లో అరంగేట్రం స్టెయిన్‌కు ఓ పీడకలే..!