స్టార్ బౌలర్.. బ్యాట్స్‌మన్ వెన్నులో వణుకుపుట్టించే వేగం.. పదునైన బౌన్సర్స్ సంధించడంలో దిట్ట. అతనెవరో కాదు దక్షిణాఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్. అలాంటి బౌలర్ ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్‌బాష్‌లో అరంగేట్రం ఎలా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇతడికి అలా జరగలేదు.
బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న స్టెయిన్ అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మొదటి మ్యాచ్ ఆడాడు. మొదటి బంతిని డాట్ బాల్‌గా వేసిన స్టెయిన్‌కు తర్వాత మాత్రం చుక్కెదురైంది. తర్వాత బంతులకు వరుసగా రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు జేక్ వెదరాల్డ్. చివరి బంతికి జేక్‌ను ఔట్ చేసి ఉపశమనం పొందాడు స్టెయిన్. కానీ వేసిన మొదటి ఓవర్లోనే 20 పరుగులిచ్చి నిరాశపర్చాడు. ఈ ఐపీఎల్ వేలంలో ఇతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 కోట్లకు సొంతం చేసుకుంది.
-
Dale Steyn's first Big Bash over was something to behold 😳 #BBL09 pic.twitter.com/kzdjRZ9X0v
— KFC Big Bash League (@BBL) December 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dale Steyn's first Big Bash over was something to behold 😳 #BBL09 pic.twitter.com/kzdjRZ9X0v
— KFC Big Bash League (@BBL) December 27, 2019Dale Steyn's first Big Bash over was something to behold 😳 #BBL09 pic.twitter.com/kzdjRZ9X0v
— KFC Big Bash League (@BBL) December 27, 2019
ఇవీ చూడండి.. పాక్ క్రికెటర్ అక్రమ్ లీక్ వీడియో.. అక్తర్ పోస్ట్