తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న మలింగ

భారత్​ చేతిలో టీ20 సిరీస్​ ఓడిపోవడం వల్ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని లసిత్ మలింగ ప్రకటించాడు. ఈ సిరీస్​ను 2-0 తేడాతో కోల్పోయింది లంక.

లసిత్ మలింగ
కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న మలింగ

By

Published : Jan 13, 2020, 7:01 AM IST

శ్రీలంక ప్రస్తుత టీ20 కెప్టెన్, సీనియర్ బౌలర్ లసిత్ మలింగ.. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగనున్నాడు. ఈ విషయమై ఆదివారం మాట్లాడుతూ ఎప్పుడైనా తాను తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. భారత్​పై ఇటీవలే టీ20 సిరీస్​ ఓడిపోవడమే ఈ వ్యాఖ్యలకు కారణం. ఈ సిరీస్​లోని రెండు మ్యాచ్​ల్లో కనీసం ఒక్క వికెటైనా తీయని కారణంగా మలింగపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపైనా మాట్లాడాడీ బౌలర్.

"ఈ సిరీస్​లో నేను కనీసం ఒక్క వికెట్​ కూడా తీయలేకపోయాను. టీ20ల్లో ఎంతో అనుభవమున్న బౌలర్​ను అయినప్పటికీ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఔట్ చేయలేకపోయాను. మేం మ్యాచ్​ గెలవాలంటే తొలి ఆరు ఓవర్లలో వికెట్లు తీయాలి. ఇక్కడ అది జరగలేదు. అందుకే సిరీస్​ను 2-0 తేడాతో కోల్పోయాం" -మలింగ, శ్రీలంక టీ20 కెప్టెన్

శ్రీలంక 2014లో టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు మలింగనే కెప్టెన్. ఆ తర్వాత 2016 వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ 2018 డిసెంబరులో సారథిగా మారి, ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు కెప్టెన్​గా 22 మ్యాచ్​లు ఆడగా, 8 గెలిచి.. 14 ఓడిపోయాడు.

మలింగ, శ్రీలంక టీ20 కెప్టెన్

ABOUT THE AUTHOR

...view details