తెలంగాణ

telangana

ETV Bharat / sports

డీఆర్​ఎస్​పై మరోసారి కోహ్లీ అసహనం

నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్​ఎస్​)పై మరోసారి రగడ ప్రారంభమయింది. ఆసీస్‌తో మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో టర్నర్​ ఔట్​పై సమీక్ష కోరిన టీమిండియాకు ...ప్రతికూల ఫలితం ఎదురైంది. దీనిపై భారత జట్టు సారథి విరాట్​ అసంతృప్తి తెలిపాడు. ఔటైనా అంపైర్​ తుది నిర్ణయం నాటౌట్​గా ప్రకటించడంపై ఈ సమీక్ష చర్చనీయాంశమయింది.

తీర్పు మార్చని డీఆర్​ఎస్​...కోహ్లీ అసహానం

By

Published : Mar 11, 2019, 2:52 PM IST

ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచినా ఓడిపోతే...దానికి డీఆర్​ఎస్​ వంటి సాంకేతికత ఓ కారణమైతే...అది చాలా పెద్ద విషయమే. అందుకే కోహ్లీ తన అసంతృప్తిని వెల్లడించాడు. ఫలితంగా సమీక్ష విధానంపై వెల్లువెత్తిన అనుమానాలపై మళ్లీ చర్చ జరుగుతోంది.

  • వివాదమేంటి...??

నాలుగో వన్డేలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం టర్నర్‌ ఉతుకుడే.. ఈ ఆసిస్​ ఆటగాడు 27 బంతుల్లో 38 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్నప్పుడు...చాహల్‌ బౌలింగ్‌లో మొదట స్టంపౌట్‌ నుంచి తప్పించుకున్నాడు. రిషబ్‌పంత్‌ బంతిని అందుకోలేకపోవడంతో ఔటయ్యే ఛాన్స్​ తప్పించుకున్నాడు. అదే ఓవర్‌లో టర్నర్‌ తరవాత బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అంపైర్​ నాటౌట్​ ఇవ్వడంతో సమీక్ష కోరిన టీమిండియా రీప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించింది. అయినా మూడో అంపైర్‌ ఔటివ్వకపోవడంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఈ ఘటన తర్వాతే టర్నర్‌ రెచ్చిపోయి 16 బంతుల్లో 46 పరుగులు బాది ఆసీస్‌ జట్టును టైటిల్​ పోరులో నిలిపాడు.

‘చాహల్‌ బౌలింగ్‌లో టర్నర్‌ బ్యాట్‌కు బంతి తగిలినట్లు రీప్లేలో కనిపించింది. అయినా అంపైర్‌ ఔటివ్వలేదు.ఈ సమీక్ష పద్ధతి సరిగ్గా లేదు. అంపైర్‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. డీఆర్ఎస్‌ పద్ధతికి స్థిరత్వం అవసరం. ప్రతిసారీ ఇదొక చర్చనీయాంశంగా మారుతోంది’.
-విరాట్​ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్​

నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించడంతోసిరీస్ 2-2తో సమం అయింది. ఈ నెల 13 బుధవారందిల్లీలోనిఫిరోజ్​ షా కోట్లా మైదానంలోఇరుజట్ల మధ్య ఫైనల్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details