తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీని వెనక్కి నెట్టి రాహుల్ సరికొత్త రికార్డు - KL Rahul completes 4000 runs in the Twenty20

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. టీ20ల్లో ఓ మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫార్మాట్​లో వేగంగా నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

రాహుల్
రాహుల్

By

Published : Feb 1, 2020, 9:22 AM IST

Updated : Feb 28, 2020, 6:07 PM IST

పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీసేనకు​ మరో మ్యాచ్​ విన్నర్​గా మారుతున్నాడు కేఎల్ రాహుల్. ప్రస్తుతం న్యూజిలాండ్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​లో అదరగొడుతున్నాడు. తాజాగా ఇతడు.. పొట్టి ఫార్మాట్​లో ఓ మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో వేగంగా నాలుగు వేల పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి 117 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడురాహుల్. తద్వారా ప్రస్తుత భారత కెప్టెన్​ కోహ్లీని(138) అధిగమించాడు.

మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక వేగంగా నాలుగు వేల పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు రాహుల్. క్రిస్​ గేల్ 107 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. షాన్ మార్ష్ (113), బాబర్ ఆజామ్ (115) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇవీ చూడండి.. 'మూడో స్థానమంటే ఇష్టం.. అందుకు సమయం పడుతుంది'

Last Updated : Feb 28, 2020, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details