సెంచూరియన్ వేదికగా ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లీష్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ దశాబ్దంలో మ్యాచ్ మొదటి బంతికే వికెట్ తీసిన నాలుగో బౌలర్‌గా పేరుగడించాడు.
అండర్సన్ వేసిన బంతిని ఆడబోయి కీపర్‌కు చిక్కాడు దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎల్గర్. తద్వారా మ్యాచ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
అండర్సన్ కంటే ముందు సురంగ లక్మల్ రెండుసార్లు (2010, 2017-శ్రీలంక), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డేయిల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించారు.