ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియాకు దూకుడైన జట్టుగా పేరుంది. మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు కాస్త దురుసుగానే ఉంటారు. ఇలాంటి సంఘటన ఇప్పుడు జరిగింది. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. ఇంగ్లాండ్ సీనియర్ అంపైర్ నిగెల్ లాంగ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. ఇదే క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న షేన్ వార్న్ కూడా అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి ఐసీసీ నిబంధనల పుస్తకాన్ని ఇవ్వాలని వ్యంగాస్త్రాలు సంధించాడు.
ఈ వివాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. స్మిత్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆసీస్ క్రికెటర్లకు దురుసు ఎక్కువ అనే విషయం మరోసారి నిరూపితమైందని మరికొందరు వ్యాఖ్యనిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య బాక్సింగ్ డే టెస్టు. ఇన్నింగ్స్ 26వ ఓవర్. కివీస్ బౌలర్ వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బంతి స్మిత్ శరీరానికి తగిలి దూరంగా వెళ్లింది. సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు స్మిత్. అయితే ఆ ప్రయత్నాన్ని అంపైర్ నిగెల్ లాంగ్ అడ్డుకున్నాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం బ్యాట్స్‌మన్ బంతిని కొట్టే ప్రయత్నంలో, బంతి బ్యాట్‌ను తాకకుండా శరీరానికి తగిలిన సమయంలో తీసే పరుగే లెక్కలోకి వస్తుందని.. ఇదే విషయాన్ని స్మిత్‌కు అంపైర్ చెప్పే ప్రయత్నం చేశాడు. అంతకుముందు ఓవర్‌లోనూ ఇలా జరిగినందున స్మిత్ అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు. అంపైర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ స్మిత్ వినిపించుకోకుండా వెళ్లిపోయాడు.
-
Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1
— Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1
— Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019Poor sportsmanship. But we’ve come to expect that from you Steve. Terrible example for kids. You are an embarrassment to the game. #NZvAUS #BoxingDayTest #MCG #stevesmith pic.twitter.com/xi0VqVjUF1
— Davidthompson420695000 (@Davidthompson42) December 26, 2019
ఇవీ చూడండి.. 'ఇంకెవరు.. ధోనీనే ఉత్తమ కెప్టెన్'