తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ మ్యాచ్​లో.. యుద్ధానికి వెళ్తున్నట్టే అనిపించింది' - శుభ్​మన్ గిల్

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యువ బ్యాట్స్​మెన్​ శుభ్​మన్ గిల్. అరంగేట్రం మ్యాచ్​లో యుద్ధానికి వెళ్తున్నానే భావన కలిగిందని అభిప్రయపడ్డాడు.

It felt like going to war: Shubman Gill on Test debut in Australia
'ఆసీస్​తో తొలి మ్యాచ్​.. యుద్దానికి వెళ్తున్నట్లే అనిపించింది'

By

Published : Mar 11, 2021, 8:57 AM IST

ఆస్ట్రేలియా టెస్టు అరంగేట్రం చేయడం.. యుద్ధానికి వెళ్లిట్లనిపించిందని యువ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్ పేర్కొన్నాడు. "మా ఫీల్డింగ్ అయిపోయేంత వరకు నేను మామూలుగానే ఉన్నా. కానీ బ్యాటింగ్ సమయానికే ఉద్వేగం మొదలైంది. ప్రేక్షకుల సందడి మధ్య డ్రెస్సింగ్ రూమ్​ నుంచి పిచ్ వైపు నడుస్తుంటే యుద్ధానికి వెళ్తున్నట్లే అనిపించింది" అని శుభ్​మన్ తెలిపాడు.

టెస్టుల్లో అరంగేట్రంతో తన చిన్ననాటి కల నెరవేరిందని గిల్ వెల్లడించాడు. "చిన్నప్పుడు తెల్లవారుజామున 4.40-5కే లేచి ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్​లు చూసేవాడిని. ఇప్పుడు నా ఆట చూసేందుకు జనం త్వరగా నిద్ర లేస్తున్నారు. అదో గొప్ప అనుభూతి" అని 21 ఏళ్ల శుభ్​మన్ అభిప్రాయపడ్డాడు. చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డప్పటికీ ఆస్ట్రేలియాతో సిరీస్​ ఆసాంతం జట్టు సానుకూల దృక్పథంతో ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో మెల్​బోర్న్​లో జరిగిన రెండో టెస్టులో శుభ్​మన్ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్​లో అతడు 259 పరుగులు సాధించాడు.

ఇదీ చదవండి:ఐఓసీ అధ్యక్షుడిగా మరోసారి థామస్ బాక్​

ABOUT THE AUTHOR

...view details