కరోనా లాక్‌డౌన్‌తో ఇంతకాలం విసుగెత్తిపోయిన క్రీడాభిమానులకు ఐపీఎల్ 13వ సీజన్ ఊరటనిస్తుందని అభిప్రాయపడ్డాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప. ఈ మెగా లీగ్ ఎంతో ప్రత్యేకమైందిగా నిలుస్తుందన్నాడు. ఈ టోర్నీతో అందరి జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఈ సీజన్లో తమ జట్టు టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
'ఐపీఎల్‌తో మా జీవితాలు సాధారణ స్థితికి'
ఈ ఏడాది ఐపీఎల్ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
రాబిన్ ఉతప్పా
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఈ మెగాలీగ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.
ఇదీ చూడండి ధోనీ కొట్టిన సిక్సర్‌కు మురళీ విజయ్ షాక్!