ఐపీఎల్ 13వ సీజన్ ఈ ఏడాది మార్చి 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే వేదికగా జరుగుతుందని సమాచారం. ఫైనల్.. మే 24న నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు క్రీడావర్గాల సమాచారం. గతంలో 51 రోజులే ఉన్న ఈ టోర్నీ.. ఈసారి 57 రోజులు జరగనుంది. ప్రతి రోజు సాయంత్రం 7.30 నిముషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆరంభ, ముగింపు వేడుకలు ఈ ఏడాదీ ఉండకపొవచ్చట. పూర్తి షెడ్యూల్ సహా అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
రెండేసి మ్యాచ్‌ల్లేవ్
ఈ సీజన్ షెడ్యూల్‌లో ఐపీఎల్ నిర్వాహకులు కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వారంతపు రోజుల్లో రెండేసి మ్యాచ్‌లను నిర్వహించకుండా ఒక్క మ్యాచ్‌నే నిర్వహించాలని నిర్ణయించారట. అంతకుముందు శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు జరిగేవి.