ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన వేలం దిగ్విజయంగా ముగిసింది. మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేసి.. 62 మందిని కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. ఈ వేలం తర్వాత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక ఆటగాళ్ల (25)తో కొనసాగుతున్నాయి. అత్యల్పంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 21 మందిని కలిగి ఉంది.
-
And that brings us to the END of the @Vivo_India #IPLAuction - Some interesting buys & big monies spent here in Kolkata. More to follow...👏👏 pic.twitter.com/NfaJKm2gyN
— IndianPremierLeague (@IPL) December 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And that brings us to the END of the @Vivo_India #IPLAuction - Some interesting buys & big monies spent here in Kolkata. More to follow...👏👏 pic.twitter.com/NfaJKm2gyN
— IndianPremierLeague (@IPL) December 19, 2019And that brings us to the END of the @Vivo_India #IPLAuction - Some interesting buys & big monies spent here in Kolkata. More to follow...👏👏 pic.twitter.com/NfaJKm2gyN
— IndianPremierLeague (@IPL) December 19, 2019
కమిన్స్ అదరహో...
ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది అత్యధిక ధర పలికాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. జాతీయ జట్టుకు ఆడని వారిలో వరుణ్ చక్రవర్తిని అదే కోల్‌కతా జట్టు రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 11 మందిని తీసుకుంది. పీయూష్ చావ్లా ఖరీదైన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
ఫ్రాంఛైజీలు తీసుకున్న ఆటగాళ్లు
ప్రతి జట్టులోనూ 18 నుంచి 25 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. వారిలో అత్యధికంగా 8 మంది వరకే విదేశీ క్రీడాకారులకు అనుమతి ఉంది. అయితే వేలం పూర్తయ్యాక పూర్తి జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- చెన్నై సూపర్ కింగ్స్
ఈ వేలంలో మొత్తం రూ.14.60కోట్లతో బరిలోకి దిగింది చెన్నై. చివరికి 15 లక్షలు మిగిలాయి. ప్రస్తుతం 24 మంది జట్టులో ఉన్నారు.
కొత్తవాళ్లు...
సామ్ కరన్(5.50 కోట్లు), పీయుష్ చావ్లా(6.75 కోట్లు), హేజిల్‌వుడ్(2 కోట్లు), సాయి కిషోర్(20 లక్షలు)
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు...
ఎంఎస్ ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, డుప్లెసిస్, అంబటి రాయుడు, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మోను కుమార్, ఎన్ జగదీశన్, హర్భజన్‌సింగ్, కరణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్
- దిల్లీ క్యాపిటల్స్
మొత్తం 27.85 కోట్లతో వేలంపాటకు వెళ్లింది. ఇంకా 9 కోట్లు మిగిలాయి. ప్రస్తుతం జట్టులో 22 మంది ఉన్నారు.
కొత్తవాళ్లు...
జేసన్ రాయ్(1.50 కోట్లు), క్రిస్ వోక్స్(1.50 కోట్లు), అలెక్స్ క్యారీ(2.40 కోట్లు), షిమ్రన్ హెట్‌మెయర్(7.75 కోట్లు), మోహిత్ శర్మ(50 లక్షలు), తుషార్ దేశ్‌పాండే(20 లక్షలు), మార్కస్ స్టొయినిస్(4.80 కోట్లు), లలిత్ యాదవ్(20 లక్షలు)
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..
శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, సందీప్ లమిచానె, రబాడ, కీమో పాల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచ్రందన్ అశ్విన్ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)
- కోల్‌కతా నైట్ రైడర్స్
మొత్తం రూ.35.65 కోట్లతో బరిలోకి దిగింది. ఇందులో 8.50 కోట్లు మిగిల్చింది. మొత్తం 22 మంది జట్టులో ఉన్నారు.
కొత్త ఆటగాళ్లు...
ఇయాన్ మోర్గాన్(5.25 కోట్లు), పాట్ కమిన్స్(15.50 కోట్లు), రాహుల్ త్రిపాఠి(60 లక్షలు), వరుణ్ చక్రవర్తి(4 కోట్లు), సిద్ధార్థ్(20 లక్షలు), క్రిస్ గ్రీన్(20 లక్షలు), టామ్ బాంటన్(1 కోటి), ప్రవీణ్ తాంబే(20 లక్షలు), నిఖిల్ నాయక్(20 లక్షలు)
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...
దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, కుల్‌దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్, లాకీ ఫెర్గుసన్, నితీశ్ రాణా, సందీప్ వారియర్, హ్యారీ గర్నీ, కమలేశ్ నాగర్‌కోటి, శివమ్ మావి, సిద్దేశ్ లడ్ (బదిలీ)
- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
రూ.42.70 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్ జట్టు.. రూ.16.50 కోట్లు మిగిల్చింది. 25 మందితో జట్టు పూర్తిగా నిండిపోయింది.
కొత్త ఆటగాళ్లు...
గ్లెన్ మాక్స్‌వెల్(10.75 కోట్లు), షెల్డన్ కాట్రెల్(8.50 కోట్లు), దీపక్ హుడా(50 లక్షలు), ఇషాన్ పొరెల్(20 లక్షలు), రవి బిష్ణోయ్(2 కోట్లు), జేమ్స్ నీషమ్(50 లక్షలు), క్రిస్ జోర్డాన్(3 కోట్లు), తజిందర్ సింగ్(20 లక్షలు), ప్రభ్‌సిమ్రన్ సింగ్(55 లక్షలు)
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...
కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, కృష్ణప్ప గౌతమ్ (బదిలీ), మహ్మద్ షమి, ముజిబుర్ రెహ్మాన్, అర్షదీప్ సింగ్, హర్దస్ విల్‌జోయిన్, మురుగన్ అశ్విన్, జే సుచిత్ (బదిలీ), హర్‌ప్రీత్ బ్రార్, దర్శన్ నల్కండె
- ముంబయి ఇండియన్స్
వేలంలో రూ.13.05 కోట్ల రంగంలో దిగి.. రూ.1.95 కోట్లు మిగుల్చుకుంది. జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉన్నారు.
కొత్త ఆటగాళ్లు...
క్రిస్ లిన్(2 కోట్లు), నాథన్ కౌల్టర్ నైల్(8 కోట్లు), సౌరభ్ తివారి (50 లక్షలు), మోసిన్ ఖాన్(20 లక్షలు), దిగ్విజయ్ దేశ్‌ముఖ్(20 లక్షలు), ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్(20 లక్షలు)
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్వింటన్ డికాక్, మిచెల్ మెక్లెనగన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, కృనాల్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ట్రెంట్ బౌల్ట్ (బదిలీ), రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, అనుకుల్ రాయ్, ధవళ్ కుల్‌కర్ణి (బదిలీ), ఆదిత్య తారె, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (బదిలీ), జయంత్ యాదవ్
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మొత్తం రూ.27.90 కోట్లతో వేలంలో అడుగుపెట్టి.... 6.40 కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 21 మంది బృందం ఉంది.
కొత్త ఆటగాళ్లు...
ఆరోన్ ఫించ్(4.40 కోట్లు), క్రిస్ మోరిస్(10 కోట్లు), జాషువా ఫిలిప్(20 లక్షలు), కేన్ రిచర్డ్‌సన్(4 కోట్లు), పవన్ దేశ్‌పాండే(20 లక్షలు), డేల్ స్టెయిన్(2 కోట్లు), షష్‌బాజ్ అహ్మద్(20 లక్షలు), ఇసురు ఉదానా(50 లక్షలు)
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు...
విరాట్ కోహ్లీ, మొయిన్ అలీ, యుజువేంద్ర చాహల్, ఏబీ డివిలియర్స్, పార్థివ్ పటేల్, మహ్మద్ సిరాజ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, గురుకీరత్ మన్, దేవత్ పడిక్కల్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని
- రాజస్థాన్ రాయల్స్
వేలంలో రూ.28.90 కోట్లతో వచ్చి... రూ.14.75 కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 25 మందితో జట్టు సిద్ధం చేసుకుంది.
కొత్త ఆటగాళ్లు...
రాబిన్ ఊతప్ప(3 కోట్లు), జయ్‌దేవ్ ఉనద్కత్(3 కోట్లు), యశస్వి జైశ్వాల్(2.40 కోట్లు), అనూజ్ రావత్(80 లక్షలు), కార్తిక్ త్యాగి(1.30 కోట్లు), ఆకాశ్ సింగ్(20 లక్షలు), డేవిడ్ మిల్లర్(75 లక్షలు), ఒషానె థామస్(50 లక్షలు), అనిరుధ్ జోషి(20 లక్షలు), ఆండ్రూ టై(1 కోటి), టామ్ కరన్(1 కోటి)
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...
స్టీవ్‌స్మిత్ (కెప్టెన్), సంజు శాంసన్, జోఫ్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, మహిపాల్ లోమ్రర్, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్రా, మయాంక్ మర్కండే (బదిలీపై), రాహుల్ తెవాతియా (బదిలీపై), అంకిత్ రాజ్‌పుత్ (బదిలీపై)
- సన్‌రైజర్స్ హైదరాబాద్
మొత్తం రూ.17కోట్లతో బరిలోకి దిగి... రూ.10.10కోట్లు మిగుల్చుకుంది. మొత్తం 25 మందితో జట్టు సిద్ధమైంది.
కొత్త ఆటగాళ్లు...
విరాట్ సింగ్(1.90 కోట్లు), ప్రియమ్ గార్గ్(1.90 కోట్లు), మిచెల్ మార్ష్(2 కోట్లు), ఫాబియన్ అలెన్(50 లక్షలు), అబ్దుల్ సమద్(20 లక్షలు), సంజయ్ యాదవ్(20 లక్షలు), సందీప్ బవనక(20 లక్షలు)
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు...
కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స్ గోస్వామి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, బిల్లీ స్టాన్‌లేక్, బాసిల్ థంపి, టి.నటరాజన్.