తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 4:41 PM IST

ETV Bharat / sports

ఓపెనర్లు శతకాలు... భారీస్కోరు దిశగా భారత్​

విశాఖ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్లు అదరగొట్టారు. రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​ నిలకడగా ఆడి చెరో శతకం సాధించారు. ఇప్పటికే మూడు మ్యాచ్​లో సిరీస్​లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది కరీబియన్​ జట్టు. ఫలితంగా కోహ్లీసేన రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్​ కచ్చితంగా గెలవాల్సి ఉంది.

india vs west indies ODI 2019
ఓపెనర్లు శతకాలు... భారీస్కోరు దిశగా భారత్​

వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు​ రోహిత్​శర్మ, కేఎల్​ రాహుల్​ శతకాలతో చెలరేగారు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో దూకుడు ప్రదర్శించారు. రోహిత్​ వన్డేల్లో​ 28వ శతకం నమోదు చేసుకోగా.. రాహులో మూడో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్​కు 227 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.

రోహిత్​ @ 28...

విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 107 బంతుల్లో శతకం సాధించాడు రోహిత్​. ఫలితంగా కెరీర్​లో 28వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. వీటితో పాటు ఈ ఏడాది.. వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ ఘనత సాధించాడు.

  1. వన్డేల్లో ఒక ఏడాది కాలంలో ఎక్కువ శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్​ నాలుగో స్థానంలో నిలిచాడు. 9 శతకాలు-సచిన్​ తెందూల్కర్​ (1998), 7 శతకాలు- సౌరభ్​ గంగూలీ (2000), 7 శతకాలు- డేవిడ్​ వార్నర్​ (2016), 7*శతకాలు- రోహిత్​ శర్మ (2019) వరుసగా ఈ జాబితాలో ఉన్నారు.
  2. ఈ మ్యాచ్​లో మరో రికార్డును అందుకున్నాడు హిట్​మ్యాన్​. ఒక క్యాలెండర్​ సంవత్సరంలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తాజా సెంచరీ సాధించేసరికి ఈ ఏడాదిలో 75 సిక్సర్లు బాదాడు. 2018లో 74 సిక్సర్లు, 2017లో 65 సిక్సర్లతో హ్యాట్రిక్​ రికార్డు కొట్టాడు.
  3. అన్ని పార్మాట్లలో కలిపి రోహిత్​ ఈ ఏడాది 10 శతకాలు చేశాడు. ఒక ఓపెనర్​ ఇన్ని సెంచరీలు చేయడం రికార్డు. గతంలో సచిన్​-(9), గ్రేమ్​ స్మిత్​(9), వార్నర్​(9) మాత్రమే సాధించారు.
  4. ఈ ఏడాది ఎక్కువ శతకాలు సాధించిన బ్యాట్స్​మెన్​లో రోహిత్​(10) టాప్​లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో కోహ్లీ(7), వార్నర్​(6) ఉన్నారు.

రాహుల్​ @ 3...

కేఎల్​ రాహుల్​ వన్డేల్లో మూడో సెంచరీ చేశాడు. 102 బంతుల్లో 100 రన్స్​(8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.

ఈ ద్వయం నాలుగోసారి..

వన్డేల్లో రోహిత్‌ శర్మ-రాహుల్‌ 130+ పరుగులకు పైగా ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని సాధించడం ఇది నాలుగోసారి. ఈ మ్యాచ్‌కు ముందు మాంచెస్టర్‌లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ 136 పరుగులు నమోదు చేయగా, బంగ్లాదేశ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 180 రన్స్​ సాధించిందీ జోడీ. శ్రీలంకతో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ జోడి 189 ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది రోహిత్​-రాహుల్​ ద్వయం. తాజా మ్యాచ్​లో తొలి వికెట్​కు 227 రికార్డు భాగస్వామ్యం సాధించారు.

ABOUT THE AUTHOR

...view details