తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 5:33 PM IST

Updated : Dec 19, 2019, 9:20 AM IST

ETV Bharat / sports

భారత బ్యాట్స్​మెన్​ 'హిట్​' షో... విండీస్ లక్ష్యం 388

విండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు, తొలి ఇన్నింగ్స్​లో అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్లు రోహిత్​, రాహుల్​ మొదట అదరగొట్టగా... ఆఖర్లో పంత్​, శ్రేయస్​ జోరు కొనసాగించారు. నిర్ణీత 50 ఓవర్లలో 388 పరుగుల భారీ లక్ష్యం ప్రత్యర్థి ముందు ఉంచింది కోహ్లీ సేన.

india vs west indies ODI 2019
టీమిండియా బ్యాట్స్​మన్​ 'హిట్​' షో... విండీ లక్ష్యం 388

విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో పరుగుల వరద పారింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్-రాహుల్​ శతకాలతో చెలరేగగా... ఆఖర్లో శ్రేయస్​, పంత్​​ సిక్సర్ల మోత మోగించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది భారత్.

రోహిత్​-రాహుల్​ ఇన్నింగ్స్​...

సిరీస్​ కాపాడుకోవాలంటే కచ్చితంగా గెలవాలన్న కసి ఓ వైపు... భారీ స్కోరు సాధిస్తే తప్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం సులభం కాదన్న విషయం మరోవైపు... ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న టీమిండియా ఓపెనర్లు.. తొలుత చాలా నెమ్మదిగా, నిలకడగా ఆడారు. వీలుచిక్కితే తప్ప అనవసరపు షాట్లకు పోకుండా శైలికి తగ్గట్లు ఆడాడు రోహిత్. ​ఈ మ్యాచ్​లో ఈ జోడీ​ శతకాలతో చెలరేగింది. రోహిత్​ కెరీర్​లో​ 28వ శతకం నమోదు చేసుకోగా, రాహుల్​.. వన్డే కెరీర్​లో మూడో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.

  • రోహిత్​@28, రాహుల్​@3...

ఈ మ్యాచ్​ 107 బంతుల్లో శతకం సాధించిన రోహిత్​... 159 పరుగుల(138 బంతుల్లో; 17 ఫోర్లు, 5 సిక్సర్లు)​ వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. కెరీర్​లో 28వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్​ రాహుల్.. ​ 102(104 బంతుల్లో; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. కెరీర్​లో మూడో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా స్వదేశంతో తొలి శతకం చేశాడు రాహుల్​. ఈ ఓపెనింగ్​ ద్వయం తొలి వికెట్​కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

ఈ ఏడాది టీమిండియా ఓపెనర్‌ రోహిత్​...10 సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో ఏడు శతకాలు సాధించాడు. ఈ ఏడాదిలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డునూ తన పేరిట లిఖించుకున్నాడు. 1998లో సచిన్‌ తెందూల్కర్​(9) సాధించిన రికార్డును అధిగమించాడు హిట్​మ్యాన్​.

2019లో ఐసీసీ టాప్‌-9 వన్డే ర్యాంకింగ్స్‌లో ఉన్న జట్లలో న్యూజిలాండ్‌ మినహా అన్ని జట్లపై రోహిత్‌ శతకాలు చేశాడు. ఈ ఏడాది అత్యధిక వన్డే పరుగుల వీరుల జాబితాలో హిట్​మ్యాన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. 1427 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు​. తర్వాత స్థానాల్లో కోహ్లీ(1292), విండీస్​ బ్యాట్స్​మన్​ షై హోప్​(1225) ఉన్నారు.

కోహ్లీ గోల్డెన్​ డక్​...

వెస్టిండీస్​తో తొలి వన్డేలో నాలుగు పరుగులే చేసిన కోహ్లీ... రెండో మ్యాచ్​లోనూ విఫలమయ్యాడు. రాహుల్‌(102) తొలి వికెట్‌గా ఔటైన తర్వాత వన్​ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్​... అనవసరపు షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు. పొలార్డ్‌ 38వ ఓవర్‌ మూడో బంతిని షార్ట్​ బాల్‌ వేయగా... షాట్​ కొట్టబోయి మిడ్‌ వికెట్‌లో క్యాచ్ లేపాడు కోహ్లీ. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న రోస్టన్‌ ఛేజ్‌ పట్టుకున్నాడు. ఫలితంగా కోహ్లీ ఇన్నింగ్స్‌ ఖాతా తెరవకుండానే ముగిసింది.

ఈ మ్యాచ్​లో అరుదైన రికార్డు అందుకున్నాడు టీమిండియా సారథి. ఇది అతడికి 400వ అంతర్జాతీయ మ్యాచ్. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన ఎనిమిదో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు విరాట్​.

ఆఖర్లో చెలరేగిన శ్రేయస్​, పంత్​...

292 పరుగుల వద్ద రోహిత ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్​... సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓ ఎండ్​లో ఉన్న శ్రేయస్​ కూడా అతడికి తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి చెరో 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదేశారు. పంత్​ 39(16 బంతుల్లో), శ్రేయస్​ 53( 32 బంతుల్లో)రాణించాడు. వీరిద్దరూ 24 బంతుల్లో 73 రన్స్​ భాగస్వామ్యం నెలకొల్పారు.

కెరీర్​లో 6వ వన్డే అర్ధశతకం తన ఖాతాలో వేసుకున్నాడు శ్రేయస్​ అయ్యర్​. ఆఖర్లో జాదవ్ 16, జడేజా 0 పరుగులు చేశారు.

ఇవీ చూడండి...

Last Updated : Dec 19, 2019, 9:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details