తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2019, 5:49 PM IST

Updated : Dec 19, 2019, 9:24 PM IST

ETV Bharat / sports

విండీస్​తో ఆఖరి పోరు ముందు భారత్​కు ఎదురుదెబ్బ

భారత్​-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్​ 1-1 తేడాతో సమంగా నిలిచింది. కటక్​ వేదికగా నిర్ణయాత్మక ఆఖరి వన్డే​ ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్​ దీపక్​ చాహర్​ గాయంతో వైదొలిగాడు.

india vs west indies
విండీస్​తో ఆఖరి పోరు ముందు భారత్​కు ఎదురుదెబ్బ

విండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఆఖరి మ్యాచ్​ కోసం సన్నద్ధమవుతున్న వేళ భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గాయంతో పేసర్ భువనేశ్వర్​ తప్పుకోగా... టీమిండియా మరో బౌలర్​ దీపక్​ చాహర్​ తాజాగా గాయంతో వైదొలిగాడు. ఇతడి స్థానంలో నవదీప్​ సైనీ జట్టులోకి రానున్నాడు.

నవదీప్​ సైనీ

"విశాఖ వన్డేలో దీపక్​ చాహర్​ గాయపడ్డాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా అతడికి కొంచెం విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. అందుకే మూడో మ్యాచ్​కు అందుబాటులో ఉండట్లేదు."
- బీసీసీఐ

కటక్​ వేదికగా నిర్ణయాత్మక చివరి వన్డే ఆడనున్నాయి ఇరుజట్లు. ప్రస్తుతం 1-1 తేడాతో సిరీస్​ సమమైంది. అయితే ఇలాంటి సమయంలో దీపక్​ గాయపడటం కొంచెం లోటే. ఈ మధ్య కాలంలో చాహర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల ఈ బౌలర్​ అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్​ సాధించిన తొలి భారతీయ క్రికెటర్​గా ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీలోనూ 8 వికెట్లు తీశాడు.

అప్పుడు శార్దూల్​... ఇప్పుడు సైనీ..

భువీ గాయపడటం వల్ల జట్టులో చోటు దక్కించుకున్నాడు పేసర్​ శార్దూల్ ఠాకూర్. తాజాగా దీపక్​ స్థానంలో సైనీని ఎంపిక చేసింది యాజమాన్యం. ఇదే ఏడాది వెస్టిండీస్​లో జరిగిన మ్యాచ్​లో మూడు వికెట్ల ప్రదర్శన చేశాడీ యువ బౌలర్.

భారత వన్డే జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్​ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, నవదీప్​ సైనీ, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, శివమ్​ దూబే, యజువేంద్ర చాహల్.

Last Updated : Dec 19, 2019, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details