ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది టీమిండియా. ఇండోర్ వేదికగా జరిగిన ఈ టీ20లో శ్రీలంక 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో కోహ్లీసేన.. 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను పూర్తి చేసింది. భారత ఓపెనర్లు అదరగొట్టారు. కేఎల్ రాహుల్ 45 పరుగులతో రాణించాడు. ధావన్ 32 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్(34), విరాట్ కోహ్లీ(30), పంత్(1) మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు.
కోహ్లీ టాప్ స్కోరర్
ఈ మ్యాచ్‌లో 1 పరుగు వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో నిలిచాడు. కెప్టెన్‌గా టీ20ల్లో వేయి పరుగులు చేశాడు విరాట్. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. 2,633 పరుగులతో రోహిత్, కోహ్లీ సమంగా ఉన్నారు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ రెండో స్థానానికి పడిపోయాడు.
లంక తక్కువకే
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగి లంక.. భారత బౌలర్లు విజృంభించడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో తక్కువ పరుగులకే పరిమితమైంది. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా లంకేయులు.. 9 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేశారు. కుశాల్ పెరీరా 34 పరుగులు(28 బంతుల్లో; 3 సిక్సర్లు), అవిష్క ఫెర్నాండో 22 పరుగులు(16 బంతుల్లో; 5ఫోర్లు) చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, కుల్‌దీప్ యాదవ్, నవ్‌దీప్ సైనీ తలో 2 వికెట్లు తీశారు. బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.