తెలంగాణ

telangana

రెండో టెస్టులో పట్టుబిగిస్తోన్న టీమిండియా

By

Published : Oct 12, 2019, 5:24 PM IST

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్​ పట్టు  బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్​లో 275 పరుగులకు ఆలౌటైంది. 326 పరుగుల తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యంలో ఉంది భారత్.

మ్యాచ్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు టీమిండియా జోరు కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లేర్‌ చేసిన కోహ్లీసేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఇంకా 326 పరుగుల ఆధిక్యంలో ఉంది భారత్.

మూడోరోజు 36/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ జట్టుపై భారత బౌలర్ల ఆధిపత్యం సాగింది. సారథి డుప్లెసిస్‌ (64), డికాక్‌ (31), బ్రూన్‌ (30) ఫర్వాలేదనిపించారు. 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్‌ మహరాజ్‌, ఫిలాండర్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్‌ మహరాజ్‌ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్‌ (164 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) పోరాటంతో సౌతాఫ్రికా కాస్త మెరుగైన స్కోర్ చేయగలిగింది.

భారత బౌలర్లలో అశ్విన్‌ నాలుగు, ఉమేష్‌ యాదవ్‌ మూడు, మహ్మద్‌ షమీ రెండు, జడేజా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. వైరల్​: రోహిత్​ను కిందపడేసిన అభిమాని

ABOUT THE AUTHOR

...view details