తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కేదార్​ను తప్పించి మరో స్పిన్నర్​ను తీసుకోవాలి' - టీమిండియాకు భజ్జీ సలహా

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైంది టీమిండియా. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. అయితే ఓటమిపై స్పందించిన హర్భజన్ సింగ్.. కోహ్లీసేనకు కొన్ని సలహాలు ఇచ్చాడు.

హర్భజన్
హర్భజన్

By

Published : Feb 6, 2020, 10:27 AM IST

Updated : Feb 29, 2020, 9:18 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పరాజయం చెందింది. టీ20 సిరీస్​ను క్లీన్​ స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్​ను ఓటమితో ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ కోహ్లీసేనకు కొన్ని సలహాలు ఇచ్చాడు.

"రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్​తో పాటు చాహల్​నూ ఆడించాలి. వీరిద్దరితో బరిలోకి దిగితే మంచి ఫలితాలు రావచ్చు. కివీస్ బ్యాట్స్​మెన్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కానీ స్పిన్ బౌలింగ్​ ఎదుర్కోవడం వారికి కొంచెం కష్టతరం. మిడిల్ ఓవర్లలో వికెట్లు సాధించాలంటే ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవడం మంచిది. అవసరమైతే కేదార్​ జాదవ్​ను పక్కనపెట్టాలి."
-హర్భజన్ సింగ్, టీమిండియా క్రికెటర్

ప్రపంచకప్​ తర్వాత కుల్దీప్, చాహల్ కలిసి ఆడలేదు. అప్పటి నుంచి ఎవరో ఒకరికి మాత్రమే తుదిజట్టులో చోటు దక్కుతోంది. కివీస్​తో జరిగిన తొలి వన్డేలో కేదార్ జాదవ్ బ్యాట్​తో ఫర్వాలేదనిపించాడు. 15 బంతుల్లో 26 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. మరి తర్వాత మ్యచ్​లో కేదార్​ను తప్పించి చాహల్​కు మేనేజ్​మెంట్ అవకాశమిస్తుందో లేదో చూడాలి.

ఇవీ చూడండి.. ధోనీ బన్​గయా పానీపూరి వాలా

Last Updated : Feb 29, 2020, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details