న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. లంచ్ విరామానికి 23 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
ఆచితూచి ఆడిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(7), పృథ్వీ షా(54) తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మయాంక్ ఇబ్బందిపడినా.. మరో ఎండ్‌లో పృథ్వీ షా చూడచక్కని షాట్లతో అలరించాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు.
విదేశాల్లో తొలి 'హాఫ్'
మయాంక్... ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అగర్వాల్ ఔటైనా పుజారాతో కలిసి స్కోరు బోర్డును మరింత పరుగులు పెట్టించాడు పృథ్వీషా. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన షా.. ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఓ సిక్సర్ బాదేశాడు. ఈ క్రమంలో విదేశాల్లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు.
రెండో వికెట్‌కు పుజారాతో కలిసి 50 పరుగులు జత చేసిన పృథ్వీ.. జేమిసన్ బౌలింగ్‌లో లాథమ్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.
క్రీజులో పుజారా, కోహ్లీ..
ప్రస్తుతం పుజారా 15, కోహ్లీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. బౌల్ట్, జేమిసన్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో రెండు మార్పులు చేసింది టీమిండియా. ఇశాంత్ శర్మ స్థానంలో ఉమేశ్, అశ్విన్ బదులు జడేజా జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్‌లో వాగ్నర్ చోటు దక్కించుకున్నాడు.