తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీ మ్యాచ్​కు కాలుష్య ముప్పు ఉండకపోవచ్చు..! - Arun Jaitley Stadium

భారత్-బంగ్లాదేశ్​ తొలి టీ20కి కాలుష్య ముప్పు ఉండకపోవచ్చని తెలిపింది బీసీసీఐ. దిల్లీ వేదికగా నవంబరు 3న ఈ మ్యాచ్​ జరగనుంది.

బంగ్లా-భారత్​ తొలి టీ20కి కాలుష్య కాటు

By

Published : Oct 28, 2019, 5:35 PM IST

Updated : Oct 28, 2019, 6:07 PM IST

భారత్​లో త్వరలో బంగ్లాదేశ్‌ క్రికెట్ జట్టు పర్యటించనుంది. 3 టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. వచ్చే నెల 3న దిల్లీ వేదికగా తొలి టీ20 జరగనుంది. అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల మ్యాచ్​ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్​ ప్రకారం మ్యాచ్​ యధావిధిగా జరుగుతుందని తెలిపాయి.

భారత్-బంగ్లాదేశ్​ మ్యాచ్​(పాత చిత్రం)

"దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నుంచి అనుమతి లభించింది. నవంబర్‌ 3 నాటికి దిల్లీలో కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని వారు చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో తొలి టీ20ను యధావిధిగా నిర్వహిస్తాం. ప్రస్తుతానికైతే మార్పులు లేవు" -బీసీసీఐ వర్గాలు

గాలి నాణ్యత, వాతావరణ అంచనా, అధ్యయన వ్యవస్థ ప్రకారం సోమవారం ఉదయం దిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాద స్థాయికి పడిపోయింది. దీపావళి రోజు బాణాసంచా పేలుళ్లతో ఈ పరిస్థితి తలెత్తింది.

2017 డిసెంబర్‌లో ఇదే మైదానంలో జరిగిన భారత్‌-శ్రీలంక టెస్టులో లంక ఆటగాళ్లు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. కాలుష్య స్థాయి పెరగడం వల్ల మాస్క్‌లు ధరించి మ్యాచ్​ ఆడారు. అయితే శీతాకాలంలో దిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించొద్దన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ రొటేషన్‌ ప్రకారం బంగ్లా మ్యాచ్‌ను కేటాయించక తప్పలేదు.

ఇది చదవండి: తొలి టీ20కి మాస్కులతో బరిలోకి బంగ్లా ఆటగాళ్లు​!

Last Updated : Oct 28, 2019, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details