తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీలో కాలుష్యం చనిపోయేంత కాదు: బంగ్లా కోచ్​

దిల్లీ వేదికగా నవంబర్​ 3న(ఆదివారం) టీమిండియాతో తొలి టీ20 ఆడనుంది బంగ్లాదేశ్​. మ్యాచ్​ ముందు వాయు కాలుష్యం వల్ల ఇబ్బందులపై స్పందించాడు బంగ్లా ప్రధాన కోచ్​ రస్సెల్​ డోమింగో. ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు తమ దేశంలోనూ ఏర్పడ్డాయని, వాటి వళ్ల ఆటకు నష్టమేమి లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

దిల్లీ కాలుష్యానికి ఆటగాళ్లు చచ్చిపోరు: బంగ్లా కోచ్ డోమింగో

By

Published : Nov 1, 2019, 3:58 PM IST

దిల్లీ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్​ మధ్య జరగనున్న తొలి టీ20పై... వాయు కాలుష్యం ప్రభావం చూపే అవకాశముంది. అయితే రెండు జట్లు తలపడనున్న ఈ మ్యాచ్​పై... బంగ్లా ప్రధాన కోచ్​ రస్సెల్​ డోమింగో మాట్లాడాడు. భారత రాజధానిలో పొగమంచు కారణంగా ఏర్పడిన ఈ కాలుష్యం తమను పెద్దగా షాక్​కు గురిచేయలేదని ఆయన చెప్పాడు. దీని వల్ల ఎవరూ చనిపోరని అభిప్రాయపడ్డాడు. ఇదే తరహా పరిస్థితులుఒక్కోసారి బంగ్లాదేశ్​లోనూ ఏర్పడతాయని అన్నాడు.

" శ్రీలంక ఆటగాళ్లు ఈ వాతావరణం వల్ల గతంలో ఇబ్బందిపడ్డారని తెలుసు. అయితే నిజానికి ఇలాంటి కాలుష్య పరిస్థితి బంగ్లాదేశ్​లోనూ కొంత వరకు ఉంది. ఇదేమి పెద్ద షాకింగ్​గా అనిపించట్లేదు. క్రికెటర్లు ఆటపైనే దృష్టిపెడుతున్నారు. దీనిపై అంతగా ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు. ఆట మూడు గంటల్లో ముగిసిపోతుంది. ఈ కాలుష్యం వల్ల కళ్లు మండటం, గొంతి నొప్ప వచ్చినా ఎవరూ చనిపోరు".
- రస్సెల్​ డోమింగో, బంగ్లా ప్రధాన కోచ్​

బంగ్లాదేశ్​ ఆటగాళ్లు ఆల్​ అమిమ్​,రోనీ, సలహాదారుడు డేనియల్​ వెటోరీ సైతం మాస్కులు ధరించి మైదానంలో ప్రాక్టీసులో పాల్గొనడం చర్చనీయాంశమైంది.

మాస్కులు పెట్టుకొని ప్రాక్టీసు చేస్తున్న బంగ్లా ఆటగాళ్లు

గతంలో...

2017లో వాయు కాలుష్యం కారణంగా కొంతమంది లంక క్రికెటర్లు వాంతులు చేసుకోగా, మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. అది టెస్టు మ్యాచ్‌ కావడం వల్ల లంక క్రికెటర్లు ఐదు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సాధారణంగా శీతాకాలంలో దిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించవద్దనే డిమాండ్‌ ఉంది. అయితే రొటేషన్‌ పద్ధతి ప్రకారం ఈ వేదికను కేటాయించక తప్పడం లేదు. తర్వాత నుంచైనా బీసీసీఐ దీనిపై చర్యలు తీసుకోవాలని క్రికెట్​ పండితులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details