తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2020, 5:23 PM IST

Updated : Feb 29, 2020, 6:45 PM IST

ETV Bharat / sports

ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. బంగ్లా లక్ష్యం 178

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (88) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు.

మ్యాచ్
మ్యాచ్

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్​ ఫైనల్లో భారత బ్యాట్స్​మెన్ తడబడ్డారు. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. ముఖ్యంగా బంగ్లా బౌలర్లు.. భారత బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో విజయం సాధించారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దివ్వాంశ్ సక్సేనా (2) తొందరగానే పెవిలియన్ చేరాడు. ఈ టోర్నీలో అద్భుత ఫామ్​లో ఉన్న యశస్వి జైస్వాల్​ మరోసారి సత్తాచాటాడు. బంగ్లా బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్​కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తిలక్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపటికే కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (7) పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. అర్ధశతకం చేసి జోరు మీదున్న యశస్వి జైస్వాల్ (88) షరిఫుల్ ఇస్లామ్ బౌలింగ్​లో ఔటయ్యాడు. వెంటనే భారత్ 21 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్​ను ముగించింది.

బంగ్లా బౌలర్లలో బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్ 3, షరిపుల్ ఇస్లామ్, తన్జీమ్ హసన్ రెండు, రకీబుల్ హసన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Feb 29, 2020, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details