తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ రంగంలోకి దిగాల్సి వచ్చింది అందుకే' - కోహ్లీ

వెస్టిండీస్​తో రెండో వన్డేలో విజయం అనంతరం స్పందించిన కెప్టెన్ కోహ్లీ.. ఓపెనర్లు విఫలమవడం వల్ల తను బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందని అన్నాడు.

కెప్టెన్ కోహ్

By

Published : Aug 12, 2019, 2:51 PM IST

Updated : Sep 26, 2019, 6:19 PM IST

క్వీన్స్​ పార్క్​ వేదికగా వెస్టిండీస్​తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 59 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో అద్భుతంగా ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన వన్డే కెరీర్​లో 42వ సెంచరీ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. అనంతరం స్పందిస్తూ.. ఓపెనర్లు పెవిలియన్​ చేరాక తను బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.

"270 పరుగులు ప్రత్యర్థికి సవాలు విసిరే స్కోరే. ఓపెనర్లు రోహిత్ శర్మ(18), శిఖర్ ధావన్(2)​ ఔటయ్యాక జట్టును నడిపే బాధ్యత నాపై పడింది. టాప్​ ఆర్డర్​లో ఉన్న ముగ్గురిలో ఎవరో ఒకరు ఆ అవకాశం తీసుకోవాలి. ఈ మ్యాచ్​లో నేను తీసుకున్నా. సెంచరీ చేయడం ఆనందంగా ఉంది." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిదైందని చెప్పాడు కోహ్లీ. వర్షం పడుతూ ఆగుతూ ఉండటం వల్ల పిచ్ ప్రమాదకరంగా తయారైందని అన్నాడు. ప్రత్యర్థి జట్టులో ఎడం చేతి వాటం బ్యాట్స్​మెన్ ఎక్కువగా ఉండటం వల్ల కుల్​దీప్​ను తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. తను ఔటయ్యాక కీలక సమయంలో 71 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్​​ను ప్రశంసించాడు కోహ్లీ.

ఇదే మ్యాచ్​లో పలు రికార్డులు తన పేరిట నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మెన్, ఓ జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్​(34)ల్లో 2000 పరుగులు చేసిన తొలి క్రికెటర్​గా అరుదైన ఘనత సాధించాడు. భారత్​ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో గంగూలీ(11,363)ని అధిగమించిన రెండో స్థానానికి ఎగబాకాడు విరాట్(11,406). తొలి స్థానంలో సచిన్ తెందూల్కర్(18,426) ఉన్నాడు. ​

ఇదీ చూడండి: రోజర్స్​ కప్​ విజేత రఫా.. ఖాతాలో 35వ టైటిల్

Last Updated : Sep 26, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details