తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరీబియన్లపై భారత్​ యువజట్టు ప్రదర్శన అదుర్స్ - శ్రేయస్ అయ్యర్

వెస్టిండీస్​-ఏతో జరిగిన వన్డే సిరీస్​ను 4-1 తేడాతో గెలుచుకుంది టీమిండియా-ఏ. ఐదు వన్డేల్లోనూ భారత్​ యువ బ్యాట్స్​మెన్, బౌలర్లు అద్భుతంగా రాణించారు.

కరీబియన్లపై భారత్​ యువజట్టు ప్రదర్శన అదుర్స్

By

Published : Jul 22, 2019, 1:45 PM IST

వెస్టిండీస్​ పర్యటనలో భారత్-ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.ఐదు వన్డేల సిరీస్​ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. జట్టులోని అందరూ సమష్టిగా రాణించి విజయాన్ని దక్కించుకున్నారు.

అంటిగ్వా వేదికగా ఆదివారం జరిగిన ఐదో వన్డేలో వెస్టిండీస్​-ఏ పై 8 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా-ఏ. ప్రత్యర్థి నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని కేవలం 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

బ్యాటింగ్​లో రుత్​రాజ్(99) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అనంతరం శుభ్​మన్ గిల్(69)​తో శ్రేయస్ అయ్యర్(61) లాంఛనాన్ని పూర్తి చేశాడు.

యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్

బౌలింగ్​లో అన్నదమ్ములు రాహుల్ చాహర్(2/53)-దీపక్ చాహర్(2/39)తో పాటు నవ్​దీప్ సైనీ(2/31) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

ఇది చదవండి: వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

ABOUT THE AUTHOR

...view details