న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. గాయపడిన ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20లతో పాటు వన్డేలకూ దూరమయ్యాడు. ఇతడి స్థానంలో టీ20లకు సంజూ శాంసన్‌ను వన్డేలకు పృథ్వీషాను ఎంపిక చేశారు సెలక్టర్లు. పొట్టి ఫార్మాట్లో చోటు దక్కించుకోని హార్దిక్ పాండ్యకు వన్డేల్లోనూ నిరాశే మిగిలింది.
వన్డే జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), పృథ్వీషా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, కేదార్ జాదవ్.