తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ ఇద్దరిలో ఒకర్ని ఎంచుకోవడం కష్టమే: విహారి

ఆసీస్​తో తొలి టెస్టు కోసం పంత్, సాహాలలో ఒకరిని ఎంపిక చేయడం టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​కు కష్టమైన విషయమేనని సహచర ఆటగాడు విహారి అన్నాడు. ఈనెల 17 నుంచి మ్యాచ్​ ప్రారంభం కానుంది.

Saha, Pant are in good form so it will be a tough call for management
ఆ ఇద్దరిలో ఒకర్ని ఎంచుకోవడం కష్టమే: విహారి

By

Published : Dec 13, 2020, 10:20 PM IST

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం పంత్​, సాహాలలో ఎవరిని తీసుకోవాలనేది మేనేజ్​మెంట్​కు కష్టమైన విషయమని భారత బ్యాట్స్​మన్ హనుమ విహారి అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫామ్​లో ఉండటమే ఇందుకు కారణమని చెప్పాడు.

"జట్టులోని ప్రతి స్థానం కోసం ఆరోగ్యకర పోటీ ఉండటం ఎప్పుడూ మంచిదే. అయితే ఎవరిని తీసుకోవాలనేది మేనేజ్​మెంట్​ నిర్ణయం. నాకు తెలిసినంతవరకు ఇద్దరూ(పంత్, సాహా) మంచి ఫామ్​లో ఉన్నారు. వారిలో ఒకరిని ఎంపిక చేయడం సవాలే" -హనుమ విహారి, భారత బ్యాట్స్​మన్

హనుమ విహారి

టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరిగిన రెండో వార్మప్ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. ఇందులో పంత్​ సెంచరీతో(103 నాటౌట్) అదరగొట్టాడు. దీంతో సాహా బదులుగా అతడిని జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు అంటున్నారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 17న అడిలైడ్ తొలి టెస్టు డే/నైట్​ పద్ధతిలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​ కోసం ఇరుజట్లు సిద్ధమతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details