భారత్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో డేవిడ్ వార్నర్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీమిండియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఓ రికార్డునూ ఖాతాలో వేసుకున్నాడీ విధ్వంసకర ఓపెనర్. 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు వన్డేల్లో ఐదు వేల పరుగుల్ని సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఐదు వేల పరుగుల్ని అత్యంత వేగంగా సాధించిన ఆసీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు వార్నర్. ఓవరాల్‌గా మూడో వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ పరుగుల్ని పూర్తి చేయడానికి వార్నర్ 115 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 114 ఇన్నింగ్స్‌లతో కోహ్లీ, వివి రిచర్డ్స్ రెండో స్థానంలో ఉండగా.. 101 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల మార్కును అందుకున్న ఆమ్లా అగ్రస్థానంలో ఉన్నాడు.