ETV Bharat / sports

ఓపెనర్ల అర్ధశతకాలు.. గెలుపు దిశగా ఆసీస్ - భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న తొలి వన్డేలో ఆసీస్ ఓపెనర్లు విజృంభించి ఆడుతున్నారు. అర్ధశతకాలు పూర్తి చేసుకొని, విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

Australia
ఓపెనర్ల
author img

By

Published : Jan 14, 2020, 7:13 PM IST

ఆస్ట్రేలియా-భారత్ తొలి వన్డేలో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. ధావన్ అర్ధశతకంతో మెరవగా కోహ్లీసేన 255 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో కంగారూ జట్టు దూకుడైన ప్రదర్శన కనబరుస్తోంది. భారత బౌలర్లపై ఆధిపత్యం వహిస్తూ ఓపెనర్లు ఫించ్, వార్నర్ అర్ధశతకాలు బాదారు. ఈ ప్రదర్శన చూస్తుంటే ఆసీస్ గెలుపు నల్లేరుపై నడకలాగే ఉంది.

బుమ్రా, షమికి ఏమైంది?

టీమిండియా బౌలింగ్ బలంగా ఉందంటూ ఈ మధ్య అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా, షమి జోడీని ఆకాశానికెత్తారు. కానీ వీరూ ఈ రోజు వేసిన తొలి స్పెల్​తో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. బుమ్రా 5 ఓవర్లు వేసి 31 పరుగులు ఇవ్వగా, షమి 4 ఓవర్లు వేసి 28 పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి 10 ఓవర్లలో వికెట్​ తీయడంలో ఇరువురూ విఫలమయ్యారు.

ఇవీ చూడండి.. నోటి దురుసు అభిమానిపై కివీస్ బోర్డు నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.