భవిష్యత్తులో తన బయోపిక్ తీస్తే అందులో, బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ నటించాలని కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. తాజాగా జరిగిన ఓ లైవ్‌సెషన్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
"గత పదేళ్ల నుంచి సల్మాన్ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అతడికి అభిమానులు చాలా మంది ఉన్నారు. బ్లాక్బాస్టర్ హిట్లతో తన కెరీర్ దూసుకెళ్తోంది. దీనితో పాటు బిగ్‌బాస్ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి అతడైతే నా బయోపిక్కు సరిగ్గా సరిపోతాడు"