తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2020, 9:21 PM IST

ETV Bharat / sports

అగస్త్యను చాలా మిస్​ అవుతున్నా: హార్దిక్​

ఐపీఎల్​ కోసం యూఏఈలో ఉన్న ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా.. తన కుమారుడు అగస్త్యను ఎంతగానో మిస్​ అవుతున్నట్లు తెలిపాడు. అగస్త్యతో సరదాగా సమయాన్ని గడిపిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు.

Hardik Pandya Shares Adorable Throwback Video With His Son
అగస్త్యను చాలా మిస్​ అవుతున్నా: హార్దిక్​

దుబాయ్​ వేదికగా గురువారం జరిగిన క్వాలిఫయర్​-1లో దిల్లీ క్యాపిటల్స్​పై ముంబయి ఇండియన్స్​ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో హార్దిక్​ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్​తో తమ జట్టుకు విజయం అందించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ జట్టు ఫైనల్ చేరుకుంది. తాజాగా ఈ ఆల్​రౌండర్​ తన కుమారుడు అగస్త్యతో ఉన్న త్రోబ్యాక్​ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

ఐపీఎల్​ కారణంగా జులై 30న జన్మించిన అగస్త్యతో హార్దిక్​ ఎక్కువ సమయం గడపలేకపోయాడు. యూఏఈలో మ్యాచ్ ఆడే సమయంలోనూ అతడి ధ్యాస అంతా తన కుమారుడిపైనే ఉందని హార్దిక్​ అంటున్నాడు. ఐపీఎల్​ కారణంగా తన కుమారుడిని ఎంతగానో మిస్​ అవుతున్నట్లు ఇన్​స్టాలో వెల్లడించాడు. అయితే ఈ సమయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నాడు. ​

ప్రస్తుత ఐపీఎల్​లో హార్దిక్​ పాండ్యా లోయర్​ ఆర్డర్​లో బ్యాటింగ్​ చేస్తున్నాడు. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన క్వాలిఫయర్​ మ్యాచ్​లో కేవలం 14 బంతుల్లో 37 పరుగులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో 57 పరుగుల భారీ తేడాతో ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. అయితే ఐపీఎల్​ పూర్తవ్వగానే పరిమిత ఓవర్ల సిరీస్​లో పాల్గొనడానికి​ పాండ్యా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details