తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాండ్య x పాండ్య ఢీ.. గెలిచింది పాండ్యనే! - practice

దక్షిణాఫ్రికా సిరీస్​ కోసం హార్దిక్ పాండ్య నెట్స్​లో చెమట చిందిస్తున్నాడు. సోదరుడు కృనాల్​తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడితో కలిసి సాధన చేసిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు హార్దిక్.

పాండ్య

By

Published : Sep 11, 2019, 8:23 PM IST

Updated : Sep 30, 2019, 6:41 AM IST

పాండ్య సోదరులు.. హార్దిక్, కృనాల్ టీమిండియాలో కీలక ఆటగాళ్లు. వెస్టిండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకున్న హార్దిక్.. స్వదేశంలో జరుగనున్న దక్షిణాఫ్రికా సిరీస్ కోసం​ నెట్స్​లో సాధన చేస్తూ చెమట చిందిస్తున్నాడు. సోదరుడు కృనాల్​ బౌలింగ్​లో భారీ షాట్లు ఆడుతూ ప్రాక్టీస్ చేశాడు. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు హార్దిక్ పాండ్య. పాండ్య్xపాండ్య ట్రైనింగ్ అంటూ పోస్ట్ చేశాడు.

"పాండ్య x పాండ్య ట్రైనింగ్.. నేనే గెలిచా అనుకుంటా అన్నయ్య.. నీ తలను బద్దలు కొట్టేంత పని చేసినందుకు నా క్షమాపణలు." - హార్దిక్ పాండ్య ట్వీట్

నెట్స్​లో హార్దిక్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కృనాల్ బౌలింగ్​లో వరుస షాట్లు ఆడుతూ సాధన చేస్తున్నాడు. విరామం లేకుండా సిరీస్​లు ఆడిన పాండ్యను వెస్టిండీస్ పర్యటనకు విశ్రాంతినిచ్చింది సెలక్షన్ కమిటీ.

ఈ నెల 15 నుంచి దక్షిణాఫ్రికా భారత్​లో పర్యటించనుంది. మూడు టీ-20లు, మూడు టెస్టులు ఆడనుంది సఫారీ జట్టు.

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా సిరీస్​లో నా బెస్ట్ ఇస్తా: పంత్

Last Updated : Sep 30, 2019, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details