దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు అరుదైన గౌరవం లభించింది. లండన్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్‌సీసీ)లో శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ విషయాన్ని ఎమ్‌సీసీ ట్విట్టర్లో పంచుకుంది.
"దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్.. ఎమ్‌సీసీలో శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాం" - ఎమ్‌సీసీ ట్వీట్
తనకు ఈ గౌరవం ఇచ్చినందుకు ఎమ్‌సీసీకి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపాడు స్మిత్.
"ఈ ఊహించని గౌరవంతో నాకు అప్పగించిన ఎమ్‌సీసీకి కృతజ్ఞతలు. లండన్‌లో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని మీతో పంచుకోవాలని ఆత్రుతతో ఉన్నా" - గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్
దక్షిణాఫ్రికా తరపున అతి చిన్నవయసులో(22) కెప్టెన్ అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు గ్రేమ్ స్మిత్. 117 టెస్టులాడిన స్మిత్ 9,265 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. 197 వన్డేల్లో 6,989 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంకులో ప్రణీత్.. సింధు నెంబర్ 6