బ్యాడ్మింటన్ తాజా ర్యాంకింగ్స్లో భారత షట్లర్లు మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్ ఓ స్థానం మెరుగుపరుచుకొని కెరీర్ బెస్ట్ 11వ ర్యాంకులో నిలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ఆరో స్థానంలో కొనసాగుతోంది.
మరో షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఒక స్థానం చేజార్చుకుని 10వ ర్యాంకులో నిలిచాడు. సమీర్ వర్మ కూడా ఓ స్థానం కోల్పోయి 18వ స్థానానికి చేరాడు. పురుషుల జాబితాలో కెంటో మెమోటా(జపాన్) అగ్రస్థానంలో ఉన్నాడు.
భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓ ర్యాంకు పడిపోయి 9వ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో తైజు యింగ్(చైనీస్) అగ్రస్థానంలో ఉంది.
ఆగస్టులో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్ ఇప్పటివరకు 12వ స్థానంలో ఉన్నాడు. ఆ టోర్నీలో ఒలింపిక్ ఛాంపియన్ కెంటో మెమోటాను ఓడించి సత్తాచాటాడు.
ఇదీ చదవండి: ఫ్రెంచ్ ఓపెన్లో సింధు శుభారంభం