తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్ చిన్నారికి గౌతమ్​ గంభీర్ సాయం - pak child visa

అనారోగ్యంతో బాధపడుతోన్న పాక్​కు చెందిన ఓ చిన్నారికి సాయమందించి సహృదయాన్ని చాటుకున్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్​. చికిత్స కోసం భారత్​కు వచ్చేందుకు వీసాలు వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు.

గంభీర్

By

Published : Oct 20, 2019, 9:13 AM IST

మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్‌ రావడానికి చొరవ తీసుకుని వీసాలు వచ్చేలా చేశాడు. వీసా జారీ చేసినట్లు భారత హైకమిషన్ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గంభీర్.

"అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు అది మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. తన చిన్ని చిన్ని పాదాలతో ఆ చిన్నారి మనకు తియ్యటి గాలిని తెస్తోంది. ఇది ఒక బిడ్డ తన పుట్టింటిని సందర్శించినట్లు ఉంది" -గౌతమ్​ గంభీర్​ ట్వీట్.

పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే చిన్నారి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుసుకున్న గంభీర్‌.. వారికి వీసా ఇవ్వాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరాడు. ఈ విన్నపంపై మంత్రి స్పందించారు. ఆ ముగ్గురికి వీసాలు జారీ చేయాలని ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌కు సూచించారు. దీంతో ఆ కుటుంబానికి వీసాలు వచ్చాయి.

భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ వైద్య సేవల కోసం మానవీయ దృక్పథంతో పాక్‌ ప్రజలకు వీసాలు ఇవ్వడం ఇది మొదటిసారేం కాదు. గతంలో పలుసార్లు భారత్‌ ఇలా వీసాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​లో కోహ్లీకి విశ్రాంతి.!

ABOUT THE AUTHOR

...view details