మ్యాచ్ ఫిక్స్ కుంభకోణం.. జట్టు సమష్టిగా ఆడటంలో విఫలం... కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సచిన్.. ఇవన్నీ టీమిండియా అప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు. అలాంటి పరిస్థితుల్లో సారథ్య బాధ్యతలు చేపట్టి గమ్యంలేని నడక సాగిస్తున్న భారత జట్టును సరైన మార్గంలో పరుగులు తీయించిన క్రికెటర్ సౌరవ్ గంగూలీ. 2000-05 మధ్యకాలంలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉండి తనదైన మార్కు చూపించిన దిగ్గజం.
కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ సత్తాచాటి విదేశాల్లో భారత గెలుపు ప్రస్థానానికి సరైన బాటలు వేసిన కెప్టెన్ గంగూలీ. నేడు దాదా పుట్టినరోజు. 1972 జులై 8న కోల్‌కతాలో జన్మించిన గంగూలీ క్రికెట్ కెరీర్లో కొన్ని మలుపురాని ఇన్నింగ్స్‌లు ఇప్పుడు చూద్దాం!
అరంగేట్ర టెస్టులోనే శతకం..
1996లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్టుతో గంగూలీ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి టెస్టులోనే శతకంతో విజృంభించాడు. అనంతరం అదే సిరీస్‌లో ఆడిన రెండో టెస్టులోనూ సెంచరీ సాధించాడు. ఇలా తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో శతకాలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ గంగూలీ నిలిచాడు.
రెండు చేతులతో ఆడగల సవ్యసాచి..
గంగూలీ అనగానే అతడి ఎడమ చేతి వాటం బ్యాటింగ్.. ఆఫ్ సైడ్ దిశగా అతడు కొట్టే కవర్ డ్రైవ్‌లే గుర్తుకువస్తాయి. అయితే సౌరవ్ కుడి చేత్తో కూడా బ్యాటింగ్ చేయగలడు. 1999 ప్రపంచకప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కుడి చేత్తో బ్యాటింగ్ చేశాడు గంగూలీ. ఆ మ్యాచ్‌లో 97 పరుగులతో ఆకట్టుకుని సవ్యసాచి అనిపించుకున్నాడు. ఇలా కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్ ప్రతిభ చూపాడు.
ప్రపంచకప్‌లో ఇప్పటికీ దాదానే కింగ్..
వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యుత్తమ వ్యక్తిగత పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు గంగూలీ. 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులతో విజృంభించాడు దాదా. ఇందులో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటికీ మెగాటోర్నీలో ఓ భారత ఆటగాడి అత్యత్తుమ వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్‌తో కలిసి 318 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా శ్రీలంకపై 157 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా.