తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​ జరుగుతుంది.. నేను ఆడతాను'

కరోనా కారణంగా ఐపీఎల్​ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఇదే విషయంపై మాట్లాడిన ఆసీస్ బౌలర్ కమిన్స్.. ఐపీఎల్ తప్పక జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను కచ్చితంగా ఆడతానని చెప్పాడు.

Everyone is keen for IPL to go ahead: Cummins on fate of IPL
ఐపీఎల్​ జరుగుతుంది.. నేను ఆడతాను

By

Published : Apr 3, 2020, 3:15 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 13వ సీజన్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు ఆస్ట్రేలియా బౌలర్​ పాట్​ కమిన్స్.​ ఈ సీజన్​లో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్​గా ఇతడు రికార్డు సృష్టించాడు. కోల్​కతా నైట్​రైడర్స్​ రూ. 15.5 వెచ్చించి, కమిన్స్​ను దక్కించుకుంది. ఈ లీగ్​​ గురించి మాట్లాడుతూ.. రద్దు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాతైనా తప్పక జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ జరిగితే తాను ఆడతానని చెప్పాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను అరికట్టడమే మన ముందున్న లక్ష్యమని అన్నాడు.

వీడని అనిశ్చితి

షెడ్యూల్​ ప్రకారం ఐపీఎల్..​ గత నెల 29న మొదలు కావాల్సింది. కరోనా ప్రభావం వల్ల ఏప్రిల్​ 15కు వాయిదా వేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం వల్ల ఈ లీగ్​ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.

అయితే పర్యాటక వీసాల్ని భారత ప్రభుత్వం ఈనెల 15 వరకు రద్దు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్​డౌన్ ఈనెల 14తో ముగుస్తుంది. కాబట్టి మూడో వారంలో ఐపీఎల్ నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి:క్రికెటర్లకు కరోనా దెబ్బ.. ఆట లేదు, ఆదాయం లేదు!

ABOUT THE AUTHOR

...view details