ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ విన్స్.. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లాడి 309 పరుగులు చేశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో 41,51 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే శనివారం మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో మ్యాచ్‌లో, అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ వల్ల దురదృష్టకరంగా ఔటయ్యాడు. ఈ వీడియోను బిగ్‌బాష్ లీగ్ తన ట్విట్టర్లో పంచుకుంది.
ఈ బ్యాట్స్‌మన్ దురదృష్టం మాములుగా లేదు!
బిగ్‌బాష్ లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ విన్స్ ఔటైన తీరు వైరల్‌గా మారింది. క్యాచ్ పట్టాల్సిన బంతి, బౌలర్ చేతి నుంచి చేజారి వికెట్లను తాకడం వల్ల ఇతడు పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది.
ఓపెనర్లుగా వచ్చిన ఫిలిఫ్-విన్స్.. ఛేదనలో తొలి నుంచి ధాటిగా ఆడారు. 5.1 ఓవర్లలో 49 పరుగులు చేశారు. బ్యాటింగ్ చేస్తున్న ఫిలిఫ్.. రెనెగేడ్స్ బౌలర్ వేసిన బంతిని షాట్ ఆడాడు. అది బౌలర్ చేతిలో పడబోయి, వికెట్లను తాకింది. దీంతో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విన్స్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రెనిగేడ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. స్మిత్ అర్ధసెంచరీ (66) చేసి, సిడ్నీ సిక్సర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: ఫించ్ సెంచరీ వృథా.. సిక్సర్స్దే గెలుపు