తెలంగాణ

telangana

ETV Bharat / sports

150వ టెస్టులో అండర్సన్​ అరుదైన ఘనత - Anderson 150 test

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టులో ఇంగ్లీష్​ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ మొదటి ఓవర్లోనే వికెట్ తీసి ఆకట్టుకున్నాడు.

England Bowler Anderson Got a Rare record In his 150th test
అండర్సన్

By

Published : Dec 28, 2019, 5:26 AM IST

ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​ల్లోనూ మొదటి ఓవర్లోనే వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ అతడి కెరీర్​లో 150వది కావడం విశేషం.

మొదటి ఇన్నింగ్స్​లో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్​ను డకౌట్​గా పెవిలియన్ పంపాడు. మొదటి బంతికే అతడిని ఔట్ చేసి ప్రతాపం చూపాడు. రెండో ఇన్నింగ్స్​లోనూ మొదటి ఓవర్ ఐదో బంతికే ప్రొటీస్ మరో ఓపెనర్ మార్క్​రమ్​ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్​లో 284 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ డికాక్​ 95 పరుగులతో ఆకట్టుకోగా.. మిగతా వారు పెద్దగా రాణించలేదు. ఇంగ్లీష్ బౌలర్లు బ్రాడ్​, సామ్ కరన్ చెరో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్​లో 181 పరుగులకే కుప్పకూలింది. ఫిలాండర్ 4, రబాడా 3 వికెట్లతో ఇంగ్లాండ్​ను దెబ్బతీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్​ మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. ఇంగ్లాండ్​పైప్రస్తుతం 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. డుస్సెన్(17), ఆన్రిచ్(4) క్రీజులో ఉన్నారు. ఆర్చర్ 2.. బ్రాడ్, అండర్సన్ చెరో వికెట్ తీశారు.

ఇదీ చదవండి: వైరల్​: జకోకు ఎలా ఎగరాలో నేర్పిస్తున్న రొనాల్డో

ABOUT THE AUTHOR

...view details