తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీని జట్టులోకి తీసుకుందామంటే ధోనీ వద్దన్నాడు'

ఒకానొక సమయంలో విరాట్​ కోహ్లీని టీమిండియాలోకి తీసుకోకుండా మహేంద్ర సింగ్ ధోనీ అడ్డుకున్నాడు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ఈ విషయాన్నే చెప్పాడు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ దిలీప్​ వెంగ్​సర్కార్.

Dhoni and Kohli
కోహ్లీని జట్టులోకి తీసుకుందామంటే ధోనీ వద్దన్నాడు

By

Published : Apr 3, 2020, 4:56 PM IST

విరాట్​ కోహ్లీ.. క్రికెట్​ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే అనేక ఘనతలు సాధిస్తూ, రికార్డులు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాడు. ధోనీ తర్వాత కెప్టెన్​గా బాధ్యతలు అందుకుని, టీమిండియాను అన్మి ఫార్మాట్లలో విజయపథంలో నడిపిస్తున్నాడు. అలాంటిది.. ఒకానొక సందర్భంలో కోహ్లీని జట్టులోకి తీసుకోకుండా ధోనీ అడ్డుకున్నాడట. ఈ విషయాన్ని మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్​సర్కార్ వెల్లడించాడు. ఆ సమయంలో మహీ, ప్రధాన కోచ్ కిర్​స్టన్​, తనకు మధ్య జరిగిన సంఘటనల్ని వివరించాడు.

"అప్పటికే అండర్​-19 ప్రపంచకప్​లో కోహ్లీ సత్తాచాటాడు. బ్యాట్స్​మన్, కెప్టెన్​గా జట్టును ముందుండి నడిపించాడు. కప్​ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. విరాట్ టెక్నిక్, బ్యాటింగ్​ శైలిని పరిశీలించిన నేను.. అతడు భారత జట్టుకు ఆడేందుకు అర్హుడని భావించాను. 2008లో శ్రీలంకతో జరిగిన సిరీస్​లో ఎంపిక చేయాలని అనుకున్నాను. అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి కోచ్​​ గ్యారీ కిర్​స్టెన్​, కెప్టెన్​ ధోనీలు తప్పుబట్టారు. అతడు ఆటను మేం చూడలేదని అన్నారు. బదులుగా దేశావాళీల్లో రాణిస్తున్న బద్రీనాథ్​కు అవకాశమివ్వాలని చెప్పారు. కానీ నేను నా నిర్ణయంపై కట్టుబడి కోహ్లీని జట్టులోకి తీసుకున్నా"

- దిలీప్​ వెంగ్​సర్కార్​, భారత సెలక్షన్​ కమిటీ మాజీ ఛైర్మన్​

క్రికెట్​లో భారత్​ తరఫున వన్డేలు, టెస్టుల్లో కలిపి 70 శతకాలు చేసిన కోహ్లీ.. దిగ్గజ సచిన్ తెందుల్కర్​(100), రికీ పాంటింగ్(71)ల తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఇదీ చదవండి:సారథి అయినా.. దూకుడు తగ్గదు: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details