బాల్ టాంపరింగ్‌తో మోసగాడిగా ముద్ర వేయించుకుని, ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు ఆ దేశ క్రికెట్‌కు హీరోగా నిలిచాడు. పునరాగమనంలో అదిరే ప్రదర్శన చేస్తున్న వార్నర్‌కు, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతిష్టాత్మక అలెన్ బోర్డర్ పురస్కారాన్ని అందజేసింది. టాంపరింగ్‌కు పాల్పడి 12 నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న మరో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఈ అవార్డు రేసులో నిలిచినా.. వార్నర్ ఒక్క ఓటు తేడాతో ఈ పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
అప్పుడు మోసగాడిగా... ఇప్పుడు హీరోగా
ఏడాది క్రితం బాల్ టాంపరింగ్‌తో నిషేధం ఎదుర్కోన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ వార్నర్.. ఇప్పుడు ఆ దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిగా మారాడు. తాజాగా ఇతడిని క్రికెట్ ఆస్ట్రేలియా.. ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించింది.
అప్పుడు జీరోగా... ఇప్పుడు హీరోగా..
2016, 2017లోనూ వార్నర్ ఈ పతకాన్ని సాధించాడు. ఈ అవార్డు అందుకుంటూ అతడు ఉద్వేగానికి గురయ్యాడు. "ఇంతకుముందు నేను అందరూ తలవంచుకునే పనిచేశాను. నిషేధం తర్వాత తిరిగి క్రికెట్లో రాణించడానికి ఎంతో పట్టుదల, అంకితభావంతో ప్రయత్నించా. ఈ సీజన్ మళ్లీ నా ముఖంలో ఆనందాన్ని నింపింది" అన్నాడు. బెలిండా క్లార్క్ పతకాన్ని ఆసీస్ మహిళల క్రికెట్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ సాధించింది.
ఇదీ చూడండి..టాస్ గెలిచిన కివీస్.. భారత్ బ్యాటింగ్
Last Updated : Feb 29, 2020, 10:49 PM IST