తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2020, 5:52 PM IST

ETV Bharat / sports

విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​గా ​స్టోక్స్​

విజ్డెన్ పురస్కారాన్ని క్రికెట్​లో అత్యుత్తమమైందిగా భావిస్తారు. 2019లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు గానూ ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​స్టోక్స్​కు ఈ గౌరవం దక్కింది. 2016 నుంచి వరుసగా మూడు సార్లు దీన్ని గెలుచుకున్న టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి ఈసారి నిరాశే మిగిలింది.

Ben Stokes Crowned Wisden's Leading Cricketer 2019 In The World
విజ్డెన్​​ లీడింగ్​ క్రికెటర్​గా బెన్​​స్టోక్స్​

గతేడాది ప్రపంచకప్​లో చేసిన ఉత్తమ ప్రదర్శనకుగానూ ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్​స్టోక్స్​ను అత్యుత్తమ పురస్కారం వరించింది. ఇతడు 2019 ఏడాదికి గానూ విజ్డెన్​ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్​గా నిలిచాడు​. మూడేళ్లుగా ఈ పురస్కారాన్ని అందుకుంటోన్న టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీని వెనక్కినెట్టి దీన్ని సొంతం చేసుకున్నాడు స్టోక్స్​. మాజీ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్​ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన ఇంగ్లాండ్​ క్రికెటర్​గా ఘనత సాధించాడు.

2019 ప్రపంచకప్​ ఫైనల్​లో న్యూజిలాండ్ జట్టుపై బెన్​స్టోక్స్​ అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ దక్కించుకున్నాడు. జట్టుకు తొలిసారి ప్రపంచకప్​ టైటిల్ అందించాడు. యాషెస్​ సిరీస్​ మూడో టెస్టులో ఆసీస్​పై 135 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఈ రెండు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని ఈ అవార్డుకు స్టోక్స్​ను ఎంపిక చేసినట్లు విజ్డెన్​ ఎడిటర్​ లారెన్స్​ బూత్​ తెలిపారు.

విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 10 సార్లు అందుకుని డాన్ బ్రాడ్‌మన్ అరుదైన రికార్డు సృష్టించగా.. 8 సార్లు జాక్ హోబ్స్ గెలుచుకున్నాడు. ఇక భారత్ తరుపున అత్యధిక సార్లు ఈ అవార్డు దక్కించుకున్న క్రికెటర్‌గా కోహ్లీ (3) రికార్డు సృష్టించాడు.

మహిళా విభాగంలో ఎలిస్ పెర్రీ

మహిళా విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్​ పెర్రీ ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. గతేడాది టీమ్​ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఈ అవార్డుకు ఎంపికైంది.

ఎల్లిస్​ పెర్రీ

ఇదీ చూడండి.. గెలిచిన ట్రోఫీలను అమ్మేసి.. పీఎంకేర్స్​కు విరాళం

ABOUT THE AUTHOR

...view details