తెలంగాణ

telangana

ETV Bharat / sports

జెర్సీ ఏదైనా దేశానికి ఆడటమే గౌరవం: శుభ్​మన్​ - shbhman gill

దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్​కు ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు యువ క్రికెటర్ శుభ్​మన్ గిల్​. దేశానికి ఆడటమే గౌరవం అంటూ ట్వీట్ చేశాడు.

శుభ్​మన్

By

Published : Sep 13, 2019, 5:16 AM IST

Updated : Sep 30, 2019, 10:14 AM IST

దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్​కు జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. ఓపెనర్​ రాహుల్​కు ఉద్వాసన పలకగా.. అతడి స్థానంలో యువ క్రికెటర్​ శుభ్​మన్​ గిల్​కు చోటు కల్పించింది. ఈ విషయంపై గిల్​ స్పందించాడు.

"అది నీలం రంగు జెర్సీనా.. లేక తెలుపు రంగు జెర్సీనా అన్నది ముఖ్యం కాదు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గౌరవం."
-శుభ్​మన్ గిల్, టీమిండియా యువ క్రికెటర్

వెస్టిండీస్​ పర్యటనలో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిరాశపర్చాడు. ఈ ఆటగాడి ఫామ్​పై మాజీలతో పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశాడు. అతడి స్థానంలో రోహిత్​ ఓపెనర్​గా బరిలో దిగనున్నట్లు స్పష్టం చేశాడు.

శుభ్​మన్​ దక్షిణాఫ్రికా సిరీస్​తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా -ఏ తో జరిగిన అనధికారిక టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో 90, 5 పరుగులు చేశాడీ యువ క్రికెటర్.

ఇవీ చూడండి.. ఫిరోజ్​ షా కోట్ల ఇకపై 'అరుణ్​ జైట్లీ స్టేడియం​'

Last Updated : Sep 30, 2019, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details