తెలంగాణ

telangana

ఇంగ్లాండ్​ పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు​ ఖరారు

By

Published : Aug 14, 2020, 3:06 PM IST

పరిమిత ఓవర్ల సిరీస్​లు ఆడేందుకు ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనుంది ఆస్ట్రేలియా. సెప్టెంబరు 4 నుంచి టోర్నీ ప్రారంభం కానున్నట్లు ఈసీబీ స్పష్టం చేసింది. ఈ పర్యటన కోసం 21 మందితో జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా బోర్డు.

Australia's limited-overs tour of England in September confirmed
ఇంగ్లాండ్​Xఆస్ట్రేలియా

ఇటీవలే వెస్టిండీస్​, పాకిస్థాన్​ జట్లకు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్​.. ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో పోటీపడేందుకు సిద్ధంగా ఉంది. త్వరలో వన్డే, టీ20 సిరీస్​ల కోసం ఆసీస్​ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబరు 4 నుంచి పర్యటన ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో తలపడే ముందు ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లు, టీ20 ఫార్మాట్​లో ప్రాక్టీస్​ మ్యాచ్​లను ఆడనుంది. సెప్టెంబర్​ 6, 8 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్​లు.. ఆ తర్వాత సెప్టెంబరు 11, 13, 16 తేదీల్లో మూడు వన్టేలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈసీబీ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ టామ్​ హారిసన్​ మాట్లాడుతూ.. ఇంగ్లాడ్​, ఆస్ట్రేలియా మధ్య జరిగే టోర్నమెంటు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.

ఈసీబీ

ఈ పర్యటనకు కృషి చేస్తున్న క్రికెట్​ ఆస్ట్రేలియా బోర్డు, ఆటగాళ్లు, సిబ్బంది, నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మ్యాచ్​లు జరిగేలా చూడటంలో వారి సహకారం కీలకమైనది. క్రికెట్​ చరిత్రలోనే ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా మధ్య పోటీ ఎంతో రసవత్తరమైనది.

టామ్​ హారిసన్​, ఈసీబీ సీఈఓ.

ఈ పర్యటన కోసం 21 మందితో జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా బోర్డు. వీరే టీ20, వన్డే మ్యాచ్​ల్లో తలపడనున్నారు.

జట్టు ఇదే...

ఆరోన్​ ఫించ్​(కెప్టెన్​), సీన్​ అబాట్​, ఆస్టన్​ అగర్​, అలెక్స్​ కేరీ, పాట్​ కమిన్స్​(వైస్​ కెప్టెన్​), జోష్​ హేజెల్​వుడ్​, మార్నస్​​ లబుషేన్​, నాథన్​ లయన్​, మిచెల్​ మార్ష్​​, గ్లెన్​ మ్యాక్స్​వెల్​, రిలే మెరేడిత్​, జోష్​ ఫిలిప్​, డేనియల్​ సామ్స్​, కేన్​ రిచర్డ్​సన్​, స్టీవ్​ స్మిత్​, మిచెల్​ స్టార్క్​, మార్కస్​ స్టొయినిస్​, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్​, డేవిడ్​ వార్నర్​, ఆడమ్​ జంపా.

ఈ క్రమంలోనే యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​లో వార్నర్​, ఫించ్​​ వంటి స్టార్​ క్రికెటర్లను ఆరంభ మ్యాచ్​ల్లో అభిమానులు మిస్సవ్వనున్నారు. సెప్టెంబరు 19న ఈ లీగ్ ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details