తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే సమరం: టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఆసీస్​ - INDIA VS AUSTRALIA

వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేలో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది ఆస్ట్రేలియా. జట్టులో ధావన్​ కూడా స్థానం కల్పించింది టీమిండియా. ఆసీస్​ సంచలనం లబుషేన్​ ఈ మ్యాచ్​తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు.

AUSTRALIA WINS TOSS AN ELECTS TO FIELD
వన్డే సమరం: టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా

By

Published : Jan 14, 2020, 1:12 PM IST

శ్రీలంకతో టీ20 సిరీస్​లో అద్భుత విజయం సాధించి నూతన ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా.. బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడటానికి సిద్ధమైంది. వాంఖడే వేదికగా ప్రారంభంకానున్న తొలి వన్డేలో ఫించ్​ సేన టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది.

సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పినట్టుగానే ధావన్​ను కూడా ​జట్టులోకి తీసుకున్నాడు కోహ్లి.

టెస్టుల్లో.. తన భీకర ఫామ్​తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న లబుషేన్.. ఈ మ్యాచ్​తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మరి బుమ్రా వంటి భారత్​ టాప్​ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిగా మారింది.

భారత్‌:

ధావన్‌, రోహిత్‌, రాహుల్‌, కోహ్లి (కెప్టెన్‌), శ్రేయస్‌, పంత్‌, జడేజా, శార్దూల్‌, కుల్‌దీప్‌, షమి, బుమ్రా.

ఆస్ట్రేలియా:

వార్నర్‌, ఫించ్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌, టర్నర్​, కేరీ, అగార్‌, కమిన్స్‌, స్టార్క్‌, కేన్​ రీచర్డ్​సన్​, జంపా.

ఈ సిరీస్​లో మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. రెండో వన్డే 17న రాజ్​కోట్​.. 19న బెంగళూరు వేదికగా చివరి వన్డే జరగనుంది.

ఇదీ చూడండి:- సచిన్​ రికార్డుకు అడుగు దూరంలో విరాట్​ కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details