తెలంగాణ

telangana

ETV Bharat / sports

32 ఏళ్ల తర్వాత జరిగిన 'బాక్సింగ్​ డే' సిరీస్​​ ఆసీస్​దే

సొంతగడ్డపై న్యూజిలాండ్​తో జరుగుతోన్న 'బాక్సింగ్​ డే' టెస్టు సిరీస్​ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 247 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్​. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

Australia Win the Boxing Day Test by 247 Runs Against Newzeland After 32 years
32 ఏళ్ల 'బాక్సింగ్​ డే' సిరీస్​​ గెలిచిన ఆస్ట్రేలియా

By

Published : Dec 29, 2019, 5:37 PM IST

Updated : Dec 29, 2019, 7:42 PM IST

32 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన 'బాక్సింగ్‌ డే' టెస్టు సిరీస్​ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు శనివారం ముగిసింది. ఇందులో ఆసీస్​ జట్టు 247 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఫలితంగా 2-0 తేడాతో కప్పు ఎగరేసుకుపోయింది కంగారూ జట్టు. ఈ విజయంతో టెస్టు ఛాంపియన్​షిప్​ పట్టికలో 256 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది ఆసీస్​. ఈ మ్యాచ్​లోనే ఆసీస్​ పేసర్​ పీటర్​ సిడెల్​ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాడు.

32 ఏళ్ల 'బాక్సింగ్​ డే' సిరీస్​​ ఆస్ట్రేలియా సొంతం

అందుకే ఫాలోఆన్​ ఆడట్లేదా...!

తొలి ఇన్నింగ్స్​లో 467 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా... ప్రత్యర్థి జట్టును 148 పరుగులకే ఆలౌట్​ చేసింది. ఇటీవల ఐపీఎల్​ వేలంలో రికార్డు ధర అందుకున్న కమిన్స్​... కంగారూ జట్టు ఆధిపత్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ పేసర్​ 28 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసి కివీస్​ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్​లో 319 పరుగుల ఆధిక్యం లభించినా ఫాలోఆన్​ ఆడించని ఆస్ట్రేలియా... రెండో ఇన్నింగ్స్​లోనూ బ్యాటింగ్​కు దిగింది. 54.2 ఓవర్ల ఆడి 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి డిక్లేర్​ చేసింది. ఫలితంగా 487 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.

ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్​లో 240 రన్స్​కే ఆలౌట్​ అయింది కివీస్​ జట్టు. టామ్​ బ్లండెల్​ మాత్రమే 121 రన్స్​ చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్​లో ఆసీస్​ బౌలర్లు లయన్​ 4 , ప్యాటిన్సన్​ 3 వికెట్లు తీశారు. శతకంతో రాణించినఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ ట్రావిస్​ హెడ్​కే 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్' దక్కింది. నామమాత్రపు చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి​ ప్రారంభం కానుంది.

విజయానందంలో ఆసీస్​ జట్టు

ఇదే కారణమా...!

2001లో భారత్​ను ఫాలోఆన్​ ఆడించి కంగుతింది ఆస్ట్రేలియా జట్టు. ఆ మ్యాచ్​లో వీవీఎస్​ లక్ష్మణ్​ 281 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అప్పట్నుంచి ఏ జట్టునూ ఫాలోఆన్​ ఆడించేందుకు ఆస్ట్రేలియా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఫాలోఆన్​ ఆడించడం వల్ల ఇన్నింగ్స్​ తేడాతో గెలిచే అవకాశం లభిస్తుంది. ఇటీవల కోహ్లీసేన మాత్రం నాలుగుసార్లు ప్రత్యర్థి జట్లపై ఇన్నింగ్స్​ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించడం విశేషం.

80 వేల మందికి పైగా హాజరు...

న్యూజిలాండ్​-ఆస్ట్రేలియా జట్లు 1987లో బాక్సింగ్‌ డే (డిసెంబర్‌ 26) టెస్టులో తలపడ్డాయి. అప్పడు 3 మ్యాచ్​ల సిరీస్​ను 1-0 తేడాతో గెలిచింది కంగారూ జట్టు. ప్రస్తుత కివీస్‌ జట్టులోని నీల్‌ వాగ్నర్‌, రాస్‌ టేలర్‌, వాట్లింగ్‌, గ్రాండ్‌హోమ్‌ మాత్రమే అప్పటికి జన్మించారు. తాజాగా మళ్లీ 2019లో ఈ సిరీస్​ జరిగింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. దాదాపు 80 వేల మందికి పైగా వీక్షకులతో ​స్టేడియం కిక్కిరిసిపోయింది. మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో ఇప్పటివరకు ఇదే అత్యధికం, నాన్​ యాషెస్​ మ్యాచ్​లో ఇది రెండోస్థానం. గతంలో ఈ మైదానంలో 51,087 మంది అభిమానులు హాజరైన రికార్డు ఉండేది. 1975లో వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో 85,661 మంది వీక్షకులు హాజరవడం ఇప్పటికీ చరిత్రగా మిగిలిపోయింది.

మైదానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ అభిమానులు

ఇదీ చదవండి...

Last Updated : Dec 29, 2019, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details