ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారీ సెంచరీతో కదం తొక్కిన రోహిత్... బ్యాట్స్మెన్ జాబితాలో తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని 14వ స్థానంలో నిలిచాడు. కాగా, ఈ జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ తన 5వ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.
రెండో ఇన్నింగ్స్లో శతకం కొట్టిన ఆల్రౌండర్ అశ్విన్.. బ్యాట్స్మెన్ జాబితాలో ఏకంగా 14 స్థానాలు మెరుగుపరుచుకుని 81వ స్థానంలో ఉన్నాడు. రెండో టెస్టులో 8 వికెట్లు తీసిన యాష్.. బౌలర్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు. ఇక ఐసీసీ ఆల్రౌండ్ల లిస్టులో 5వ స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తన మొదటి స్థానాన్ని భద్రపరుచుకున్నాడు. ఆల్రౌండర్ల లిస్టులో వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ 407 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.