వికెట్ కీపర్‌గా ఎన్నో ఘనతలు సాధించాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్. కీపర్‌గా అతడి పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఓపెనర్‌గా, టెస్టుల్లో 7వ స్థానంలో ఆడుతూ జట్టుకు విశేష సేవలందించిన గిల్‌క్రిస్ట్‌ను ప్రపంచంలో ఉత్తమ వికెట్ కీపర్ ఎవరు అనడిగితే మాత్రం.. ఇంకెవరు ధోనీనే అంటూ సమాధానమిచ్చాడు. భారత్ నుంచి ధోనీని, శ్రీలంక నుంచి కుమార సంగక్కరను, న్యూజిలాండ్ నుంచి మెక్‌కల్లమ్‌ను, దక్షిణాప్రికా నుంచి మార్క్ బౌచర్‌ను ఉత్తమ కీపర్లు అంటూ పేర్కొన్నాడు గిల్లీ. వీరందరిలో భారత మాజీ కెప్టెనే ఉత్తమం అని పేర్కొన్నాడు.
'ధోనీ క్రికెటర్‌గా ఎదిగిన తీరు అద్భుతం' - ధోనీ అత్యుత్తమ కీపర్
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్. ధోనీ క్రికెటర్‌గా ఎదిగిన తీరును ఎంతో ఇష్టపడ్డట్లు తెలిపాడు.
"ధోనీనే ఎంచుకుంటా. నా పేరు గిల్లీ.. సిల్లీ కాదు. నాకు తెలుసు భారత్‌లో ఎంతో మంది అభిమానులున్న ధోనీ గురించి మాట్లాడుతున్నా. నా దృష్టిలో ధోనీనే టాప్‌లో ఉంటాడు. ఆ తర్వాతి స్థానాల్లో సంగక్కర, మెక్‌కల్లమ్, బౌచర్ ఉంటారు" అని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు గిల్‌క్రిస్ట్.
ధోనీ క్రికెటర్‌గా ఎదగడాన్ని ఎంతో ఇష్టపడ్డట్లు ఈ ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం పేర్కొన్నాడు. "ధోనీ ఎదిగిన విధానాన్ని చూసి ఎంతో ఇష్టపడ్డా. అతడు ఆడే విధానం, అతడి స్టైల్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అభిమానులు అతడిపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటూ ఎంఎస్ ఆడిన విధానం ఎంతో ప్రత్యేకం. తనని తాను అదుపులో పెట్టుకునే విధానం అత్యద్భుతం" అని గిల్‌క్రిస్ట్ కొనియాడాడు.