టీమ్ఇండియా బౌలర్లు నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లకు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ ట్విట్టర్లో క్షమాపణలు తెలిపాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న తొలి వన్డేకు కామెంటరీ చేస్తున్న గిల్‌క్రిస్ట్.. సిరాజ్‌కు బదులుగా సైనీ తండ్రి మరణించాడని అన్నాడు. అనంతరం తప్పు తెలుసుకుని, ట్విట్టర్ వేదికగా ఇద్దరూ బౌలర్లకు క్షమాపణలు చెప్పాడు.
సిరాజ్, సైనీలకు క్షమాపణలు చెప్పిన గిల్‌క్రిస్ట్
భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీలకు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ క్షమాపణలు చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేలో కామెంటరీ చేస్తూ, సిరాజ్‌కు బదులుగా సైనీ తండ్రి చనిపోయారని అనడం ఇందుకు కారణం.
"అవును.. నేను తప్పుగా మాట్లాడని గ్రహించాను. నా తప్పునకు సైనీ, సిరాజ్‌లను క్షమాపణలు కోరుతున్నాను" అని గిల్‌క్రిస్ట్ ట్వీట్ చేశాడు.
మహ్మద్ సిరాజ్ తండ్రి ఇటీవలే మరణించినా.. నిర్బంధ నియమాలకు కారణంగా సిరాజ్ భారత్‌కు రాలేదు. అయితే తన ఇంటికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినా.. తన తల్లి సూచన మేరకు జట్టుతో శిక్షణలో పాల్గొనాలని సిరాజ్ నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత టెస్టు జట్టుకు మహ్మద్ సిరాజ్ ఎంపికవ్వగా.. నవదీప్ సైనీ శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో ఆడుతున్నాడు.