తెలంగాణ

telangana

ETV Bharat / sports

కార్తీక్ ప్యాంట్ వేసుకున్నావా?: లిన్

టీమ్ఇండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు. అయితే ఇతడి పోస్టుకు ఫన్నీ కామెంట్ పెట్టాడు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ క్రిస్ లిన్.

Karthik, Chris Lynn
కార్తీక్, లిన్

By

Published : May 11, 2021, 7:52 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా క్రికెటర్లు కూడా తమ తొలి డోసు వేసుకునే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. తాజాగా మంగళవారం వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు. అయితే దీనిపై ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ ట్రోల్ చేశాడు.

'ఎట్టకేలకు ప్యాంట్ వేసుకున్నావా?' అంటూ కార్తీక్​ను ఆటపట్టించాడు లిన్. దినేశ్ కార్తీక్, క్రిస్ లిన్ రెండేళ్ల పాటు కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు. 2018 నుంచి కార్తీక్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించగా.. ఇతడి సారథ్యంలో రెండేళ్లు ఆడాడు లిన్. ఆ ఏడాదితో పాటు 2019లోనూ నిరాశపర్చిన లిన్​ను వదులుకుంది కేకేఆర్. ప్రస్తుతం ఇతడు ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details