టీ20 ప్రపంచకప్ వేదికపై స్పష్టత రానుంది. జూన్ 1న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇందుకోసం సమావేశాన్ని నిర్వహించనుంది. ఇంతకంటే ముందు మే 29న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం వర్చువల్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితుల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
టీ20 ప్రపంచకప్ వేదికపై త్వరలో స్పష్టత!
జూన్ 1న ఐసీసీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని మే 29న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని వర్చువల్గా ఏర్పాటు చేయనుంది. దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో టీ20 ప్రపంచకప్ నిర్వహణ గురించి ఇందులో ప్రస్తావనకు రానుంది.
బీసీసీఐ, టీ20 ప్రపంచ కప్
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో భారత్ వేదికగా జరగనున్న పొట్టి ప్రపంచకప్ కోసం భారత్ తొమ్మిది వేదికలను నిర్ణయించింది. దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో పరిస్థితులను మరోసారి అంచనా వేయనున్నారు. దీంతో పాటు మహిళల క్రికెట్ క్యాలెండర్ గురించి కూడా చర్చించనున్నారు.