తెలంగాణ

telangana

ETV Bharat / sports

సైనా, శ్రీకాంత్​.. ఈసారి ఒలింపిక్స్​కు​​ కష్టమే? - కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ అర్హత

కరోనా కారణంగా భారత షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్..​ ఒలింపిక్స్ ఆశల్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరిద్దరూ మలేసియా ఓపెన్​లో పాల్గొనాల్సి ఉంది. ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ ప్రక్రియలో ఇదే చివరి ప్రధాన టోర్నీ!. కానీ ఆ దేశ ప్రభుత్వం విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో వీరు ఆ టోర్నీలో ఆడటం అనుమానంగా మారింది.

Saina, Srikanth
సైనా,శ్రీకాంత్​

By

Published : May 7, 2021, 5:28 AM IST

భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ టోక్యో ఒలింపిక్స్‌ అర్హత పొందే అవకాశాలు రోజురోజుకు కష్టంగా మారుతున్నాయి. భారత్‌లో కరోనా సెకండ్​ వేవ్​ ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి తమ దేశానికి వచ్చే విమాన సేవలను మలేసియా, సింగపూర్​ రద్దు చేయడమే ఇందుకు కారణం. దీంతో మలేసియా ఓపెన్‌(మే 25-30), సింగపూర్​ ఓపెన్​లో(జూన్​ 1-6)​ భారత షట్లర్లు పాల్గొనే విషయంపై సందేహాలు మొదలయ్యాయి. ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియలో ఇవే చివరి ప్రధాన టోర్నీలు.

ఇప్పట్లో ఇవ్వలేమని..

ఈ నేపథ్యంలో భారత దేశ బ్యాడ్మింటన్​ టీమ్​ను అనుమతించేలా మన క్రీడా మంత్రిత్వ శాఖ మలేసియా​ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కానీ ఆ దేశ ప్రభుతం.. మన షటర్ల ప్రయాణ అనుమతిని ఇప్పట్లో ఇవ్వలేమని తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశంలోని భారత హై కమిషన్​ తెలిపినట్లు శాయ్​ తెలిపింది. దీంతో మలేసియా​ ఓపెన్​ నుంచి భారత షటర్లు తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. కాబట్టి ఈ రెండు టోర్నీల్లో నెగ్గి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని ఎదురుచూస్తున్న సైనా, శ్రీకాంత్​కు ఎదురుదెబ్బ తగలనుంది!. మరోవైపు పీవీ సింధు, సాయి ప్రణీత్​, సాత్విక్​రాజ్​ రాంకిరెడ్డి, చిరాగ్​ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి కూడా ఇందులో పాల్గొనాల్సి ఉంది.

ర్యాంకులు పడిపోయే అవకాశం..

మహిళల, పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-16లో ఉన్న షట్లర్లే ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంటారు. ప్రస్తుతం సైనా 19వ, శ్రీకాంత్‌ 14వ ర్యాంకులో ఉన్నారు. అయితే ఈ టోర్నీల్లో వీరు పాల్గొనకపోతే వీరి ర్యాంకులు మెరుగవ్వకపోవడమే కాకుండా ఇంకా పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి భారత్‌ నుంచి పీవీ సింధు, సాయి ప్రణీత్‌, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీకి మాత్రమే ఆ మెగా క్రీడలకు అర్హత సాధించే ర్యాంకింగ్‌ ఉంది.

ABOUT THE AUTHOR

...view details